సిఐటీయు ఆధ్వర్యంలో రాయపోల్‌లో నిరసన…

ఫిబ్రవరి 12 మన వార్త

రాయపోల్

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సిఐటియు రాయపోల్ మండల అధ్యక్షులు పొట్టెల స్వామి అన్నారు. గురువారం రాయపోల్ మండల కేంద్రం ఎంపీడీవో కార్యాలయం ముందు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల పిలుపుతో జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా సిఐటీయు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టి, కార్మిక చట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు భద్రత కల్పించాలని, కనీస వేతనాన్ని పెంచాలని వారు డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం యధా విధంగా కొనసాగించాలని, ఈ చట్టం స్థానంలో తీసుకొస్తున్న వి బి జి రామ్ పథకాన్ని రద్దు చేయాలన్నారు. కార్మిక హక్కులను కాపాడాలని, కార్మికులపై భారం మోపే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ అంగన్వాడీ టీచర్లు పద్మ, సునీత, పద్మ, పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment