దొంగతనాల భయంతో గుగ్గిళ్లలో రాత్రి కాపలాగా గోరుకలుప్రతి ఇంటి నుంచి చందా…గ్రామ రక్షణకు ఇద్దరు గోరుకలు నియామకం….

.బెజ్జంకి,ఫిబ్రవరి 12 (మన వార్త ప్రతినిధి);సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ల గ్రామంలో పరిసర గ్రామాల్లో వరుస దొంగతనాలు చోటుచేసుకుంటుండటంతో గ్రామ ప్రజల్లో ఆందోళన నెలకొంది.ఈ నేపథ్యంలో గుగ్గిళ్ల గ్రామపంచాయితీ పాలకవర్గం గ్రామస్తుల సహకారంతో గ్రామ రక్షణ కోసం ఇద్దరు గోరుకలను నియమించారు.గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి నెలకు రూ.50 వరకు చందా సేకరించి,రాత్రి వేళల్లో గ్రామంలో పహారా కాయడానికి వారిని ఏర్పాటు చేసినట్లు గ్రామ పెద్దలు తెలిపారు.రాత్రి సమయంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనిస్తూ దొంగతనాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ఈ చర్యలతో గ్రామస్తుల్లో కొంతమేర భద్రతాభావం కలిగిందని,గతంలో సుమారు 30 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి గోరుకలు ఉండేవారని,అప్పట్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని గ్రామస్తులు గుర్తుచేశారు. గ్రామ రక్షణ కోసం ముందడుగు వేసిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Comment