మేడారంలో దుస్తులు మార్చుకోడానికి మహిళలు ఇబ్బందులు…

ములుగు పిబ్రవరి 8మేడారం జాతరలో జంపన్న వాగు దగ్గర స్నానం చేసిన భక్తులు,మహిళలాకు బట్టలు మార్చుకొనుటకు ఇబ్బంది పడుతున్నారు.జాతర సమయంలో జంపన్న వాగు దగ్గర దుస్తులు మార్చుకొనుటకు రేకులతో డబ్బాలు ఏర్పాటు చేయగా జాతర అయిపోయివడంతో బట్టలు మార్చుకోను 2 రేకు డబ్బులను ఉంచి, అన్ని డబ్బాలను తీసుకొనిపోయారు. ఆదివారం సెలవు దినం కావడంతో వేల సంఖ్యలో భక్తులు రావడంతో స్నానం చేయుటకు నల్లాలు చరిపోయేంత లేక, మహిళలు దుస్తులను మార్చుకొనుటకు నలుగురు మహిళ చుట్టు చిరాను అడ్డుపట్టి వస్రలను మార్చుకుంటున్నారు. తక్షణమే అధికారులు, స్థానిక మంత్రి సీతక్క స్పందించి నల్లలాను, దుస్తులు మార్చుకోను రేకుల డబ్బాలను జంపన్న వాగు వద్ద ఏర్పాటు చేయాలనీ మహిళ భక్తులు కోరుతున్నారు.

Leave a Comment