మనోభావాలు దెబ్బతీసే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు..ఎస్సై సిరిసిల్ల అశోక్…

.ఇల్లంతకుంట, ఆగస్టు 8 (మన వార్త ప్రతినిధి):సోషల్ మీడియా,వాట్సాప్ గ్రూపుల్లో అసభ్యకరమైన,అవమానపూర్వక పోస్టులు చేసిన ఇద్దరు వ్యక్తులపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం,6-8-2025 బుధవారం రోజున ముస్కానిపేట గ్రామానికి చెందిన సామనపల్లి శంకర్ (కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీ సభ్యుడు) తనపై “మన ఊరు మన మండలం” అనే వాట్సాప్ గ్రూపులో ఇల్లంతకుంట గ్రామానికి చెందిన మహమ్మద్ సాదుల్ అనే వ్యక్తి అవమానకరమైన మెసేజ్‌లు పంపినట్లు … Read more

యూరియా కోసం పడి కాపులు కాస్తున్న రైతులు…

.నిజాంపేట ఆగష్టు 5(మన వార్త ప్రతినిధి నరేందర్)రైతులకు ఎరువుల కొరత ఉండడంతో నిజాంపేట సొసైటీ వద్ద రైతులు పడి కాపులు కాస్తున్నారు.రెండు రోజుల క్రితం లారీ లోడ్ యూరియా రావడంతో త్వరగా అయిపోవడం జరిగిందని రైతుల నుండి ఆధార్ కార్డు పట్టా పాస్ బుక్ ద్వారా యూరియా అందిస్తున్నామని సొసైటీ నిర్వాహకులు తెలిపారు. సొసైటీ గోదాంలో యూరియా లేకపోవడంతో రెండు రోజుల నుండి పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం యూరియా కొరత లేదని జిల్లా … Read more

అల్వాల్–కొంపల్లి రహదారిపై రోడ్డు ప్రమాదం – వృద్ధుడు మృతి…..

మల్కాజ్గిరి జిల్లా ఆగస్టు 5 మన వార్త అంతోని అల్వాల్ కొంపల్లి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అల్వాల్ ప్రాంతానికి చెందిన ఒక వృద్ధుడు దురదృష్టవశాత్తు మృతి చెందాడు.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.పోలీసుల దర్యాప్తు ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు సేకరిస్తున్నారు.సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది వృద్ధుడి … Read more

ప్రతాప్ రెడ్డి డైరెక్షన్లో*…*పనిచేస్తున్న నాయిని యాదగిరి, మద్దూరి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టడమే వారి లక్ష్యం అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టడం నాయిని యాదగిరి నైజం *పదవులు కట్టబెట్టిన ప్రతాప్ రెడ్డి రుణం తీర్చుకుంటున్న నాయిని యాదగిరి**పిల్లికి కూడా బిచ్చం పెట్టని మల్లారెడ్డి పార్టీకి ఖర్చు పెట్టానని అనడం సిగ్గుచేటు…..

గజ్వేల్ ఆగస్టు 05 (మన వార్త ప్రతినిధి జీ మురళి) కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను రచ్చ చేసేందుకు ప్రతాపరెడ్డి కుట్ర పన్నగా, అందులో నాయిని యాదగిరి, మల్లారెడ్డి పావులుగా మారినట్లు గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ నేత సమీర్, మాజీ కౌన్సిలర్ నక్క రేగొండ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్ష కార్యదర్శులు మొనగారి … Read more

అల్వాల్‌ లో దొంగల బృందం అరెస్టు – రూ.లక్షల్లో విలువైన ఆస్తులు స్వాధీనం….

మల్కాజ్గిరి జిల్లా ఆగస్టు 4 మన వార్తా ప్రతినిధి అంతోని : అల్వాల్ సర్కిల్ లోని అంజనాపూరి కాలనీ, మచ్చ బొల్లారం, అల్వాల్‌ లోని ఒక ఇంటి తాళం పగలగొట్టి బంగారు, వెండి నగలు, నగదు దోచుకున్న దొంగల బృందాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటనలో 26 తులాల బంగారు నగలు, 20 గ్రాముల వెండి వస్తువులు, రూ.50,000 నగదు, మొబైల్ ఫోన్లు మరియు పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు.ఫిర్యాదుదారు కుంబాల సుషాంత్ ఇచ్చిన పిర్యాదు మేరకు … Read more

యువత ఆన్లైన్ గేమ్స్ ఆడి ఆగం కావద్దు..సిరిసిల్ల రూరల్ సిఐ మొగిలి….

.ఇల్లంతకుంట ఆగస్టు 04 (మన వార్త ప్రతిని):జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు సోమవారం ఇల్లంతకుంట మండలంలోని జవారిపేట గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.ఈ సందర్భంగా “మీ కోసం” కార్యక్రమాన్ని ఇల్లంతకుంట ఎస్‌ఐ సిరిసిల్ల అశోక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా,సిరిసిల్ల రూరల్ సీఐ మొగలి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ,యువత ఆన్లైన్ బెట్టింగ్ మరియు గేమింగ్ యాప్స్‌ వల్ల తాము అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని,అప్పులు చేసి డబ్బులు … Read more

నలుగురు పేకాట రాయుల అరెస్ట్ ఒక ఇన్నోవా కారు ఐదు మొబైల్ ఫోన్ లు స్వాధీనం…

చిన్న శంకరంపేటఆగష్టు 4(మన వార్త ప్రతినిధి నరేందర్)చిన్న శంకరంపేట మండలంలోని గవ్వల పల్లి రైతు వేదిక వెనకాల పేకాట ఆడుతున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆదివారం రాత్రి పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు, పేకాట ఆడుతున్న ఏడుగురిలో 1 సంగయ్య పల్లి గ్రామానికి చెందిన గొల్ల బాబు,2, గబలపల్లి కోయమారి తండాకు చెందిన రామావత్ ప్రభాకర్,3, తూప్రాన్ పట్టణానికి చెందిన ఏదునంద,4, సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ గ్రామానికి చెందిన శ్రీరామ్ వేణు లు నలుగురిని పట్టుకోగా మరో … Read more

పోలీస్ స్టేషన్ అద్దె భవనాన్ని ప్రారంభించిన సీపి గౌస్ అలాం….

శంకరపట్నం:ఆగస్ట్04(మనవార్త ప్రతినిధి నేరెళ్ల సంతోష్)శంకరపట్నం మండలం మొలంగూర్ శివారులో అద్దె భవనంలో ఏర్పాటు చేసిన కేశవపట్నం పోలీస్ స్టేషన్ ను సోమవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం ప్రారంభించారు.కేశవపట్నం పోలీస్ స్టేషన్ శిథిలావస్థకు చేరుకోవడంతో మొలంగూర్ శివారులోని అద్దె భవనంలోకి మార్చారు.పోలీస్ స్టేషన్ ఆవరణలో సీపి గౌస్ అలాం మొక్కలు నాటారు.అద్దె భవనాన్ని ప్రారంభించి స్టేషన్ హౌస్ ఆఫీసర్,రైటర్ రూమ్, రికార్డుల గది,రిసెప్షన్ కౌంటర్, వెయిటింగ్ హాల్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన … Read more

మోడల్ స్కూల్ ను సందర్శించిన రాష్ట్రస్థాయి అధికారులు…

శంకరపట్నం:ఆగస్టు04(మన వార్త ప్రతినిధి నేరెళ్ల సంతోష్) కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల(మోడల్ స్కూల్‌) ను సందర్శన పరిశీలనలో భాగంగా కరీంనగర్ జిల్లా పరిశీలకుడు డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలంగాణ అధికారి ఏ.కృష్ణా రావు,క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డిలు సోమవారం సందర్శించారు.ఈ సందర్భంగా వారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి. సరిత ఆధ్వర్యంలో పాఠశాలలో నిర్వహిస్తున్న విద్యా ప్రమాణాలు,సాధించిన విజయాలు,ప్రత్యేక కార్యక్రమాలపై పరిశీలన చేశారు.మోడల్ స్కూల్, మరియు వసతి గృహంలో గల వివిధ సౌకర్యాలను … Read more

గుర్తుతెలియని మృతదేహం లభ్యం…

చిన్న శంకరంపేటఆగస్టు 4(మన వార్త ప్రతినిధి నరేందర్) చిన్న శంకరం పేట మండల కేంద్రంలోని జీకే వైర్ పరిశ్రమ సమీపంలో సోమవారం ఉదయం ఒక మగ వ్యక్తి మృతదేహం ఉన్నదని పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు, పంచనామ నిర్వహించి విచారణ చేపట్టి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు, ఈ సందర్భంగా చిన్న శంకరంపేట ఎస్సై నారాయణ గౌడ్ సమాచారం మేరకు జీకే వైర్ పరిశ్రమ సమీపంలో ఒక … Read more