వేములవాడ ఆగష్టు 15 (మన వార్త ప్రతినిధి) అగ్రహారం హనుమాన్ దేవాలయం లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.. ఆలయ అధికారులు జాతీయ జెండా ఎగురా వేసారు. రంగురంగు జెండాలతో ఆలయం శోభాయమానంగా తీర్చిదిద్దుకున్నారు. జాతీయ జెండా త్రివర్ణ పథకాన్ని ఎగురవేసి విద్యార్థులకు, భక్తులకు స్వీట్లు పంచారు. .ఈ కార్యక్రమం లో ఆలయ కార్య నిర్వహణ అధికారి నాగారపు శ్రీనివాస్, ఆలయ వ్యవస్థాపక వంశీ ధర్మకర్త గౌరిశెట్టి మహేందర్, మరియు ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.