పరిశ్రమలలో భద్రత చర్యలు ప్రామాణికంగా తనిఖీలు చేపట్టిన అధికారులు….

చేగుంట ఆగస్టు 14 (మన వార్త ప్రతినిధి) భద్రతా చర్యలు ప్రామాణికంగా తనిఖీలలో భాగంగా చేగుంట మండలం చిన్న శివునూరు గ్రామ శివారులోని శ్రీ వెంకటేశ్వర క్వాయర్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నెహ్రూ బృందం తనకి చేపట్టారు, ఈ సందర్భంగా పరిశ్రమలో తీసుకుంటున్న భద్రత ప్రమాణికాలు, కార్మికుల దినచర్య పరిశ్రమల నిర్వహణ కర్మాగారాల్లో పనిముట్ల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు, అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరిశ్రమలలో తనిఖీలు చేయడం జరుగుతుందని పరిశ్రమలు తీసుకుంటున్న భద్రత ప్రామాణికాలు, పనిముట్ల పనితీరును పరిశీలించడం జరిగిందని సంబంధిత నివేదికలను జిల్లా కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు, ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రకాష్ రావు, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నెహ్రూ, తదితరులు పాల్గొన్నారు

Leave a Comment