బస్సులు ఆపాలంటూ విద్యార్థుల రాస్తారోకో….

చేగుంట ఆగస్టు 13 (మన వార్త ప్రతినిధి)చేగుంట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాల సమీపంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యార్థులు బస్సుల కోసం బుధవారం ధర్నా, రస్తారోకో నిర్వహించారు, మేము విద్యార్థులమేనని తమకు న్యాయం చేయాలని, కళాశాల ముందు బస్సు ఆపాలని, డిఎం డౌన్ డౌన్, డిఎం వెంటనే రావాలని, డి ఎం వచ్చేదాకా కదిలేది లేదంటూ, నినాదాలు చేస్తూ విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు, విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులతో, కళాశాల అధ్యాపకులతో, మాట్లాడి వారిని శాంతింప చేసి, కళాశాల ముందు బస్సును ఆపిస్తానని హామీ ఇచ్చి, ఆందోళన కార్యక్రమాన్ని విరమింప చేశారు, ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు విద్యార్థులు మాట్లాడుతూ 2009లో కళాశాల ప్రారంభమైనప్పటి నుంచడి బస్సు కోసం విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మోడల్ పాఠశాలకే ప్రత్యేకంగా బస్సు వేశారని అంటూ కళాశాల విద్యార్థులను బస్సులో ఎక్కించుకోవడంలేదని వారు తెలిపారు, మండలంలోని వివిధ గ్రామాల నుండి విద్యార్థులు కళాశాలకు రావడం జరుగుతుందని, కళాశాల విద్యార్థులను చూడగానే బస్సు ఆపడం లేదని ఆర్టీసీ బస్సుకు అందరు విద్యార్థులకు సమానమేనని, కళాశాల విద్యార్థులు బస్సు ఎక్కిన కళాశాల ముందు ఆపకుండా మాడల్ పాఠశాల కాంపౌండ్ లోపల బస్సు ఆపడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు, కళాశాల ముందు బస్సు ఆపిన కూడా ఆపకుండా వెళ్ళిపోతున్నారని అధికారులు స్పందించి కళాశాల ముందు బస్సు ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు. కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ కళాశా,ల మోడల్ పాఠశాల, పాలిటెక్నిక్ కళాశాల, లు ఒకే దారిలో ఉన్నాయని ఆర్టీసీ బస్సు వాళ్ళు అందరు విద్యార్థులను బస్సు ఎక్కించుకొని తీసుకురావాలని వర్షాకాలం దృష్ట్యా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకే ఆర్టీసీ బస్సు రావడం జరుగుతుందని ఇప్పటికైనా ఆర్టీసీ సిబ్బంది కళాశాల పాలిటెక్నిక్ కళాశాల మోడల్ పాఠశాల వద్ద బస్సు ఆపాలని ఆయన అన్నారు.

Leave a Comment