* మల్యాల, ఆగష్టు 12(మన వార్త ప్రతినిధి)మల్యాల కేంద్రంలో మంగళవారం తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. బ్లాక్ చౌరస్తా నుంచి మొదలుకొని ప్రధాన వీధుల గుండా అంగడి బజార్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. దేశభక్తి ఉట్టిపడేలా కొనసాగిన ఈ ర్యాలీలో పార్టీలకతీతంగా ప్రజలు, వాగ్దేవి పాఠశాలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని త్రివర్ణ పతాకాన్ని చేతబూని జయహో భారత్ అని నినదిస్తూ ముందుకు సాగారు. అనంతరం స్థానిక అంగడి బజార్ వద్ద సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించి జాతికి గౌరవ వందనం సమర్పించారు.