రామాయంపేట ఆగష్టు 14 (మన వార్త ప్రతినిధి)రామాయంపేట మండలంలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర సమయంలోనే బయటకు రావాలని తహశీల్దార్ రజని కుమారి సూచించారు, ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల మేరకు రాగల 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసర పరిస్థితులను బయటకు రావాలని, శిథిలావస్తులను ఉన్న ఇళ్లల్లో ఉండకుండా జాగ్రత్తగా ఉండాలని, ఇల్లు కూలిపోయే పరిస్థితిలో ఉండి ఎక్కడ ఉండాలో వారికి అర్థం కాని పరిస్థితి ఉంటే రెవెన్యూ అధికారులకు సమాచారం అందిస్తే వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చడం జరుగుతుందని ఆమె తెలిపారు, గ్రామాలలో విద్యుత్ సిబ్బంది ఆశ వర్కర్లు పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడి కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి ఆపద వచ్చిన సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించాలని ఆమె సూచించారు.