*శంకరపట్నం:ఆగస్టు09(మనవార్త ప్రతినిధి నేరెళ్ల సంతోష్)రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి.వివరాల్లోకి వెళితే శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన చల్లూరి అనిల్ (27)బ్యాండు కొట్టడానికి వెళ్లి తిరిగి లింగాపూర్ కు వస్తుండగా లింగాపూర్ చింతలపల్లి మధ్యలో మెట్పల్లి గ్రామానికి చెందిన బాకారపు అజయ్ (20) మెట్పల్లి నుండి చింతలపల్లెకు వెళ్తుండగా రెండు బైకులు మూలమలుపు వద్ద ఢీకొనగా ఇద్దరికీ గాయాలు కాగా చల్లూరి అనిల్ కు తలకు బలమైన గాయం తగిలింది.అది చూసిన స్థానికులు 108 కు ఫోన్ చేయడంతో 108 సిబ్బంది ఈఎంటి గూడూరి సతీష్ రెడ్డి మరియు పైలెట్ ఎం,గోపికృష్ణ సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్ లోకి తీసుకొని ప్రతిమ చికిత్స అందిస్తూ హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు.