మెదక్ ఆగష్టు 13 (మన వార్త ప్రతినిధి)వాతావరణ శాఖ అంచనా ప్రకారం, రాబోయే 72 గంటలపాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల తీవ్రత కారణంగా వాగులు, వంకలు, చెరువులు, తక్కువ ఎత్తు ప్రాంతాలు నీటమునిగే అవకాశముందనీ అత్య పనులు ఉంటేనే తప్ప బయటకు పెళ్లెప్పుడు గాని సూచించారు, వాగులు, వంకలు, చెరువులు, causewayల వద్దకు వెళ్లకుండా ఉండాలన్నారు. పిల్లలు, వృద్ధులు మరియు గర్భిణీలు బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బలహీనమైన విద్యుత్ తీగలు, చెట్లు, గోడలు మొదలైన వాటికి దగ్గరగా వెళ్లకూడదని,. అత్యవసర పరిస్థితి వచ్చినా, వెంటనే 100 నంబర్ లేదా స్థానిక పోలీస్ స్టేషన్ సంప్రదించాలన్నారు,.పోలీస్ శాఖ మీకు అందుబాటులో ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు తెలిపారు.