బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు….

..రామాయంపేటఆగష్టు 9 (మన వార్త ప్రతినిధి నరేందర్)ఒక యూట్యూబ్ ఛానల్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని నార్సింగి తహసిల్దార్ కార్యాలయంలో లైసెన్సుడు సర్వేయర్ గా పనిచేసే శ్రీకాంత్, రామాయంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు, ఈ సందర్భంగా శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ తనను అకారణంగా ఓ వ్యక్తి యూట్యూబ్ ఛానల్ కు తాను సీఈఓ అని పరిచయం చేసుకొని తాను అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు చేయడమే కాకుండా తన వద్ద నుంచి పదివేల రూపాయల నగదు బంగారు ఉంగరం తీసుకున్నారని ఆరోపించారు, తనను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా తన వద్ద నగదు ఉంగరం తీసుకున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు, నగదు మరియు ఉంగరం ఇస్తుండగా వీడియో కూడా చిత్రీకరించానని దాని సాక్షాదారంగా ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.

Leave a Comment