వాహనాలు విస్తృతంగా తనిఖీలు….

*గజ్వేల్ ఆగస్టు 11( మన వార్త ప్రతినిధి జీ మురళి)సిద్దిపేట్ పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఆదేశానుసారం మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ సోమవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు ‌ గజ్వేల్ ట్రాఫిక్ సీఐ ‌మురళీ పోలీసుల సిబ్బందితో కలిసి విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేస్తూ డ్రైవింగ్ లైసెన్, ఇన్సూరెన్స్, ఆర్సి, హెల్మెట్ చెకింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ ‌మురళీ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు వాహనదారులలో ప్రజలలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతుందని దాన్ని దృష్టిలో ఉంచుకొని సేఫ్టీ సెక్యూరిటీగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. త్రిబుల్ రైడింగ్ పై ప్రతిరోజు నిర్వహిస్తామని తెలిపారు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు ఈ తనిఖీల్లో గజ్వేల్ ఏ ఎస్ ఐ జగదీశ్వర్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment