పలు ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు..

-సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్‌లను నమ్మవద్దు… -పోలీసులు,ప్రభుత్వం ఇచ్చే అధికారిక సమాచారాన్నే నమ్మాలి: జిల్లా ఎస్పీ మహేష్ … (మన వార్త ప్రతినిధి దెబ్బట్టి ప్రవీణ్) భారతదేశ వ్యాప్తంగాగా నెలకొన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో జిల్లాలో నిఘా పెంచడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు.శనివారం రోజున జిల్లాలోని వేములవాడ దేవస్థానం,నాంపెళ్లి గుడి,మిడ్ మ్యానేర్ డ్యామ్ తో పాటుగా సిరిసిల్ల,వేములవాడ బస్టాండ్ లలో బాంబు స్క్వాడ్,డాగ్ స్క్వాడ్ టీమ్ తో తనిఖీలు చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ … Read more

మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి కౌన్సిలింగ్…

మన వార్త ప్రతినిధి దెబ్బట్టి ప్రవీణ్: వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత పది రోజులుగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులకు శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీ.ఐ వీర ప్రసాద్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మరోసారి మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండేందుకు తనిఖీల్లో పట్టుబడిన వారి చేత ప్రమాణం చేయించి అనంతరం వారికి రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ … Read more

పలు సమస్యలపై జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన బార్ కార్యవర్గం.. -సానుకూలంగా స్పందించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి…

వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యవర్గం గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి నీరజ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా వేములవాడ కోర్టులో మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏర్పాటు, ఫస్ట్ అడిషనల్ కోర్టు, కోనరావుపేట మండలాన్ని వేములవాడ కోర్టుకు బదిలీ చేయుట, కోర్టు బిల్డింగ్ పై అంతస్తు నిర్మాణం, తదితర అంశాలపై వినతిపత్రం సమర్పించడం జరిగింది.అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిని మాధవి, జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ కార్యదర్శి … Read more

ధాన్యం కొనుగోలను వేగవంతం చేయండి :::తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర రెడ్డి చేగుంట మే 08 (మన వార్తా ప్రతినిధి నరేందర్)

చేగుంట మండలంలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో APM, IKP CC,PACS ల సీఈఓ లకు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు, అకాల వర్షం నేపథ్యంలో ధాన్యం కొనుగోలు వేగంగా జరపాలని ఎప్పటికప్పుడు కొనుగోలు వివరాలు ట్యాబ్లో నమోదు చేసి రైతుల ఖాతాలు డబ్బులు త్వరగా జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో జయచంద్ర రెడ్డి ఆదేశించారు, ఈనెల 15వ తేదీ వరకు ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాల్లో … Read more

స్వర్ణగిరి శ్రీనివాసునికి తిరుప్పావడ సేవ….

*నయనానందకరంగా స్వర్ణగీరీశున్ని నిత్య కళ్యాణ మహోత్సవం.* *ఆలయ తీరు వీధుల్లో వెంకన్న స్వామికి తీరు వీధి ఉత్సవ సేవ.* *యాదాద్రి భువనగిరి జిల్లా మే / 08 / మన వార్త జిల్లా ప్రతినిధి* కలియుగ ప్రత్యక్ష దైవమైన యాదాద్రి తిరుమల స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో నేటి ఉదయం సుప్రభాత సేవతో మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు పలు కార్యక్రమాలను చేపట్టినట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు ఆలయ … Read more

ఎంపీడీవో కు వినతిపత్రం సమర్పించిన యువకులు..

శంకరపట్నం:మే08(మనవార్త ప్రతినిధి నేరెళ్ల సంతోష్) కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రం కేశవపట్నంలోని ప్రధాన రహదారిని విస్తరించాలని గురువారం ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్ కు గ్రామ యువకులు వినతిపత్రాన్ని సమర్పించారు. గ్రామ ప్రధాన రహదారి బాగా ఇరుకుగా ఉన్నందున రవాణా వాహనాలు,పెద్ద వాహనాల ప్రయాణానికి ఇబ్బంది కలుగుతున్న దృష్ట్యా రహదారి విస్తరణ చేపట్టాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. స్పందించిన ఎంపీడీవో కలెక్టర్ కి నివేదిక సమర్పిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు చల్లా రాజ్ కుమార్,బిజెపి … Read more

భూ సమస్యలు ఉన్న ప్రతి రైతుకు భూ భారతి చట్టం వరం…

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎప్రిల్ / మన వార్త జిల్లా ప్రతినిధి సామాన్యులకు చట్టాలు అను కూలంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం భూ భారతి చట్టం రూపొందించిందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు.సోమవారం రోజు మోటకొండూరు మండల కేంద్రంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూ భారతి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ (రెవెన్యూ)వీరారెడ్డి తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ … Read more