కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో సమాజసేవలో భాగంగా వికాస తరంగిణి జమ్మికుంట శాఖ ఆధ్వర్యంలో స్వర్ణామృత ప్రాశన కార్యక్రమం నిర్వహించి, మొదటి విడత ఔషధం 6 నెలల వయసు నుండి 16 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న 260 పిల్లలకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున ఉదయం 7-00 గంటలకు నుండి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం జమ్మికుంట లో స్వర్ణామృత ప్రాశన ఔషధం ను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఔషధం ద్వారా పిల్లలకు రోగనిరోధక శక్తిని, జీర్ణక్రియను, మేధస్సును, జ్ఞాపక శక్తిని, మాటలు సరిగా రావడానికి తోడ్పడుతుంది, కోపాన్ని తగ్గిస్తుంది, కావున జమ్మికుంట చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఉన్న చిన్న పిల్లల తల్లితండ్రులకు ఈ సదవకాశాన్ని వినియోగించగలరని జమ్మికుంట వికాస తరంగిణి శాఖ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వికాస తరంగిణి జిల్లా అధ్యక్షులు గౌతంరావు, ఆలయ చైర్మన్ ముక్క జితేందర్ గుప్తా,డింగరి హరికృష్ణమాచార్యులు, పుల్లూరి ప్రభాకరరావు, బచ్చు వీరలింగం, ముక్క శివకుమార్, రిటైర్డ్ సి. హెచ్.ఓ. రెడ్డి శంకర్ రెడ్డి, డాక్టర్ సురేష్ బాబు, అంతం రాజిరెడ్డి, పుల్లూరు శ్రీనివాస్, వెంకన్న, రవీందర్, ముస్కే వీరరాజు, తదితరులు పాల్గొన్నారు.