చందుర్తి మండలం ఎస్సైగా జిల్లాల రమేష్ బాధ్యతల స్వీకరణ…

-శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపు..
చందుర్తి మండలం,జూన్ 04 ( మన వార్త ప్రతినిధి దెబ్బట్టి ప్రవీణ్) చందుర్తి మండలం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా జె. రమేష్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో జరిగిన సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మండలంలోని శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎటువంటి శాంతి భద్రతలకు భంగం జరగకుండా పోలీస్ వ్యవస్థ ప్రజలతో సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ నేరాల నివారణలో భాగస్వాములు కావాలి,” అని ఆయన పేర్కొన్నారు.అంతేగాక, మండలంలో శాంతి, భద్రతలను మరింత బలోపేతం చేయడం కోసం స్థానికంగా ప్రత్యేక చర్యలు చేపడతామని రానున్న స్థానిక సంస్థ ఎన్నికల నైపద్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండల ప్రజలు సహకరించాలని తెలిపారు.

Leave a Comment