ఘనంగా మోహన్నగారి రాజు దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు…

గజ్వేల్, జూన్ 07( మన వార్త ప్రతినిధి జీ మురళి) సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్న గారి రాజు పూజిత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా శనివారం వారి స్వగృహంలో వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అధ్యక్షుడు జగ్గయ్య గారి శేఖర్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సారిక శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, ఆధ్వర్యంలో మోహన్నగారి రాజు పూజిత దంపతులకు శాలువాతో సత్కరించి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొని గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నంగునూరు సత్యనారాయణ మాట్లాడుతూ మోహన్నగారి రాజుకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని, రాజకీయ వ్యాపార రంగంలో రాణిస్తూ సమాజ సేవలో తన వంతు పాత్ర పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మోహన గారి రాజు పూజిత దంపతులకు ముక్కోటి దేవతల అనుగ్రహం కలకాలం ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కొండ పోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ అయిత సత్యనారాయణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సారిక శ్రీనివాస్ రెడ్డి, కప్ప భాస్కర్ ,అరుణ్,వాసవి క్లబ్ సభ్యులు గంగిశెట్టి వెంకటేశం, సిద్ది నవీన్, సిరిపురం సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు

Leave a Comment