మల్యాల, జూన్ 05(మన వార్త ప్రతినిధి) మల్యాల కొండగట్టు పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గర ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్సై నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మామిడికాయల లోడుతో వస్తున్న డీసీఎం వ్యాను, పెళ్లి బృందంతో వెళ్తున్న ఎర్టిగా కారు ఎదురెదురుగా ఢీకొట్టాయి. దీంతో ఎర్టిగా కార్లో ఉన్న ఆరుగురికి గాయాలు కాగా, మూడు నెలల బాబు చనిపోయాడు. గాయాలైన వారిని వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.