హరీష్ రావు ప్రజానాయకుడు — ఎన్ సీ సంతోష్
ఫ్రెండ్స్ ఫర్ యు అసోసియేషన్ ఆద్వర్యంలో ఘనంగా మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు
గజ్వేల్ జూన్ 03 (మన వార్త ప్రతినిధి జీ మురళి)
మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో బి ఆర్ ఎస్ యువ నాయకుడు ఎన్ సీ సంతోష్ ఆధ్వర్యంలో అంగడిపేట్ హనుమాన్ దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి నిరుపేదలకు అరటిపండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎన్ సీ సంతోష్ మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ అన్న అంటే నేను ఉన్న అంటూ అందరి అభిమానం పొందిన మాజీ మంత్రి హరీష్ రావు ప్రజా నాయకుడు అని వారి జన్మదినం సందర్భంగా బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఫ్రెండ్స్ ఫర్ యు అసోసియేషన్ ఆద్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు, ఫ్రెండ్స్ ఫర్ యు అసోసియేషన్ సభ్యులు విష్ణు వర్ధన్ రెడ్డి, కొమరవెల్లి ప్రవీణ్, నరేందర్ రెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు