ఘనంగా కవ్వంపల్లి జన్మదిన వేడుకలు

ఘనంగా కవ్వంపల్లి జన్మదిన వేడుకలుశంకరపట్నం:జూన్10(మనవార్త ప్రతినిధి నేరెళ్ల సంతోష్)మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు శంకరపట్నం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొపగోని బస్వయ్య గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ హాజరై కేకు కోసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వేములవాడ పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు పొలాస(వంటల)రాజేశం గుండెపోటుతో మృతి..

నివాళులు అర్పించిన బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, వేములవాడ , జూన్ 10 (మన వార్త ప్రతినిధి నందు రావు) వేములవాడ పట్టణంలోని బాలా నగర్ కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, పొలాస(వంటల)రాజేశం గుండె పోటుతో మరణించగా వారి భౌతిక కాయానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి మరియు కోయినేని బాలయ్య, రఘు రాం, వరాల … Read more

వేములవాడ పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు పొలాస(వంటల)రాజేశం గుండెపోటుతో మృతి..నివాళులు అర్పించిన బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి,వేములవాడ , జూన్ 10 (మన వార్త ప్రతినిధి నందు రావు) వేములవాడ పట్టణంలోని బాలా నగర్ కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, పొలాస(వంటల)రాజేశం గుండె పోటుతో మరణించగా వారి భౌతిక కాయానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి మరియు కోయినేని బాలయ్య, రఘు రాం, వరాల శ్రీనివాస్, వెంకన్న, రాజు,దేవరాజు, విజయ్ యాదవ్ తదితరులు.

యూసఫ్ గూడ కృష్ణానగర్ లో జోరుగా అక్రమ నిర్మాణాలు.

తెలంగాణ స్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జూన్ 9, మనవార్త. యూసఫ్ గూడ పరిధిలోని కృష్ణానగర్ లో అక్రమ నిర్మాణాలు యాదేచ్చగా కొనసాగిస్తున్నారు. సదరు అక్రమ నిర్మాణదారుడు యదేచ్చగా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులకు మించి అంతస్తులు అక్రమంగా నిర్మిస్తున్నాడు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా హైకోర్టు అధికారులకు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసిన ఆగని అక్రమ నిర్మాణాలు. బాధ్యత కలిగిన అధికారులు తమకేమీ పట్టనట్టుగా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ … Read more

కొండపోచమ్మ తల్లిని దర్శించుకున్న తాజా మాజీ సర్పంచ్ కరుణాకర్ రెడ్డిగజ్వేల్ జూన్ 09( మన వార్త ప్రతినిధి జీ మురళి)కొండపోచమ్మ తల్లి అనుగ్రహంతో అందరూ బాగుండాలని తాజా మాజీ సర్పంచ్ కరుణాకర్ రెడ్డి అన్నారు సోమవారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం కొండ పోచమ్మ తల్లిని దర్శించుకున్న సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామ తాజా మాజీ సర్పంచ్ గజ్వేల్ కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని సకాలంలో వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండి పండిన పంటలకు గిట్టుబాటు ధర రావాలని అందరూ బాగుండాలని కొండ పోచమ్మ తల్లిని వేడుకోవడం జరిగిందని అన్నారు వారితో పాటు ప్రసాద్, యూట్యూబార్ గాగిలాపురం సాయి బాబ తదితరులు ఉన్నారు

ఘనంగా మోహన్నగారి రాజు దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు…

గజ్వేల్, జూన్ 07( మన వార్త ప్రతినిధి జీ మురళి) సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్న గారి రాజు పూజిత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా శనివారం వారి స్వగృహంలో వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అధ్యక్షుడు జగ్గయ్య గారి శేఖర్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సారిక శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, ఆధ్వర్యంలో మోహన్నగారి రాజు పూజిత దంపతులకు శాలువాతో సత్కరించి … Read more

పేకాట రాయులు అరెస్ట్…

మల్కాజ్గిరి జిల్లా,జూన్ 6 (మన వార్త జిల్లా ప్రతినిధి అంతోని ) అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైకేల్ సెయింట్ మైకేల్ స్కూల్ సమీపంలో ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న పదిమంది పేకాట రాయులను పక్కా సమాచారంతో ఎస్ఓటి టీం పట్టుకున్నారు వారి వద్ద నుండి 35 వేల నగదు 13 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

చందుర్తి మండలం ఎస్సైగా జిల్లాల రమేష్ బాధ్యతల స్వీకరణ…

-శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపు.. చందుర్తి మండలం,జూన్ 04 ( మన వార్త ప్రతినిధి దెబ్బట్టి ప్రవీణ్) చందుర్తి మండలం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా జె. రమేష్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో జరిగిన సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మండలంలోని శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎటువంటి శాంతి భద్రతలకు భంగం జరగకుండా పోలీస్ వ్యవస్థ … Read more

మీర్జాలగూడా లో అర్ధరాత్రి షాపులపై బుల్డోజర్ సహాయంతో షట్టర్లు తొలగింపు…

మల్కాజ్గిరి జిల్లా,మన వార్త ప్రతినిధి అంతోని : మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్జాలగూడా లో అర్ధరాత్రి షాపులపై బుల్డోజర్ సహాయంతో షట్టర్లు తొలగింపు.అర్ధరాత్రి సమయంలో దారుణ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఓ బిల్డింగ్ యజమాని,తన స్వంత భవనంలో పనిచేస్తున్న 16 షాపుల షట్టర్లను బుల్డోజర్ సహాయంతో కూల్చివేశాడు.ఈ ఘటనతో బాధిత కిరాయిదారులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ షాపుల్లో కొంతమంది 15 ఏళ్లకుపైగా వ్యాపారం చేస్తున్నవారు.ఇటీవల బిల్డింగ్ యజమాని వారిని షాపులు ఖాళీ చేయాలని … Read more

కొండగట్టు వద్ద రోడ్డు ప్రమాదం… ఆరుగురికి గాయాలు, మూడు నెలల బాబు మృతి…

మల్యాల, జూన్ 05(మన వార్త ప్రతినిధి) మల్యాల కొండగట్టు పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గర ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్సై నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మామిడికాయల లోడుతో వస్తున్న డీసీఎం వ్యాను, పెళ్లి బృందంతో వెళ్తున్న ఎర్టిగా కారు ఎదురెదురుగా ఢీకొట్టాయి. దీంతో ఎర్టిగా కార్లో ఉన్న ఆరుగురికి గాయాలు కాగా, మూడు నెలల బాబు చనిపోయాడు. గాయాలైన వారిని వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటన … Read more