మల్కాజ్గిరి జిల్లా – జూన్ 14
జిల్లా ప్రతినిధి: అంతోని
మచ్చబొల్లారం 133 డివిజన్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, మాన్సూన్ ముందు జాగ్రత్త చర్యలపై మరింత దృష్టి సారిస్తూ ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ అపూర్వా చౌహాన్‌ను కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ కలిశారు.
ఈ సమావేశంలో ప్రస్తుతానికి కొనసాగుతున్న స్టోమ్ వాటర్ డ్రైన్ (జలానికాస్టోమ్స్) మరియు బాక్స్ డ్రైన్ పనుల పురోగతి పై సమీక్ష జరిపారు. ముఖ్యంగా మిస్సింగ్ లింక్ డ్రైనేజ్ పనులు, మరమ్మత్తులు అవసరమైన ప్రాంతాలు గుర్తించి తక్షణమే పనులను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.
అలాగే, చెక్కిపోయిన రోడ్లకు సిమెంట్ కాంక్రీట్ ( సిసి) ప్యాచింగ్ చేపట్టాలని సూచించారు. మోన్సూన్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని నీటి నిల్వలు, ట్రాఫిక్ సమస్యలు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, డివిజన్ నాయకులు కూడా పాల్గొని సమస్యల పరిష్కారానికి తమ సూచనలు అందించారు.
ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సమయానుసారంగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ తెలిపారు.