గజ్వేల్ జూన్ 14 (మన వార్త ప్రతినిధి జీ మురళి)సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శుక్రవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ అధ్యక్షులు జగ్గయ్య గారిశేఖర్,వాసవి క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గోవుకు పూజలు నిర్వహించి, అనంతరం నిరుపేదలకు గొడుగులు, గృహ నిర్మాణ కార్మికులకు సామాగ్రి ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ అధ్యక్షుడు జగ్గయ్య గారి శేఖర్ మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవ అని వాసవి క్లబ్ సభ్యుల సహకారంతో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా డాన్ టు డస్క్ అనే ప్రోగ్రాం ద్వారా నిరుపేదలకు అండగా ఉండాలని అనే సంకల్పంతో ఉచిత డయాబెటిక్ క్యాంప్, ఉచితంగా సిమెంట్ బెంచీల పంపిణీ, రైతులకు తట్ట పారా, మహిళ వ్యాపారస్తులకు గొడుగులు, తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని రాబోయే కాలంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సేవలను విస్తృత పరుస్తామని అన్నారు, ఈ కార్యక్రమంలో డిస్టిక్ వి 105 రీజియన్ టు జోన్ ఈసీ ఆఫీసర్ రేగురి హనుమంతరావు, ఐపిసి వేణు, ఆర్ సి పుల్లూరి శంకర్, జెడ్ సి హరి కిరణ్, గంగిశెట్టి వెంకటేశం ,సిద్ధి నవీన్, కైలాస్ ప్రశాంత్,ఉమేష్, బుద్ద శంకరయ్య,ఎర్రం శ్రీనివాస్,ఉప్పాల కృష్ణమూర్తి, సిరిపురం సత్య నారాయణ, బుద్ధ శంకరయ్య, ఉప్పల చంద్రశేఖర్, విక్రాంత్, అత్తెల్లి శ్రీనివాస్, మర్యాల శ్రీనివాస్, మాయ్యాలా భద్రయ్య, గంగ రమేష్ వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు