బీఆర్‌ఎస్ కార్యకర్త కుటుంబానికి ప్రమాద బీమా చెక్కును అందజేసిన మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి….

పార్టీ కోసం పని చేసే వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం. పద్మదేవేందర్ రెడ్డి
రామాయంపేట
జూన్ 14
(మన వార్త ప్రతినిధి నరేందర్)
రామాయంపేట మున్సిపల్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పరుపుగాళ్ల. నర్సింలు గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పొందడంతో పార్టీ ప్రమాద బీమా పథకం కింద 2 లక్షల రూపాయల చెక్కును మంజూరు చేపించి బాధితుడి భార్య పరుపుగాళ్ల. లావణ్యకు మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ. పట్టణ,గ్రామా స్థాయి నుంచి పార్టీని పటిష్టపర్చడంలో కార్యకర్తల పాత్ర క్రియాశీలకమైందన్నారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. ప్రతి కార్యకర్తకు అండగా పార్టీ ఎల్లప్పుడూ ఉంటుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ పల్లె. జితేందర్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ బాదే. చంద్రం, నిజాంపేట్ మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి,మాజీ ఎంపీపీ బిక్షపతి, మాజీ ఎంపిటిసి హైమద్, రామయంపేట మండల యూత్ అధ్యక్షులు ఉమామహేశ్వర్, నాయకులు మార్కు ధాత్తు, పోచమల. ఐలయ్య,మల్లేశం,రాములు, అసనుద్దీన్,నాగర్జున్ ,కృష్ణ గౌడ్, రమేష్ తదితరులు ఉన్నారు.

Leave a Comment