తూప్రాన్ జూన్ 14 (మన వార్త ప్రతినిధి, పి. ఆంజనేయులు గౌడ్) తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈ నెల 15 నుండి 18 వరకు గ్రామదేవతల జాతర కార్యక్రమం ఉంటుంది. ఆదివారం ఉదయం బొడ్రాయికి జలాభిషేకం, మధ్యాహ్నం ముత్యాలమ్మ, రేణుక మాత, నల్ల పోచమ్మ, కనకదుర్గమ్మలకు బోనాల సమర్పించే కార్యక్రమం ఉంటుంది. సోమవారం గ్రామ నడిబొడ్డున ఊరడమ్మ పండగ, మంగళవారం మహంకాళి అమ్మ పండుగ, బుధవారం దుర్గమ్మ పండగతో జాతర ఉత్సవాలు, విందు భోజనాలు ముగుస్తాయని గ్రామ పెద్దలు తెలిపారు.