సర్వీస్ రోడ్ల ఆక్రమణ పై నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ సీరియస్ తూప్రాన్ జూన్ 12…..

సర్వీస్ రోడ్ల ఆక్రమణ పై నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ సీరియస్ తూప్రాన్ జూన్ 12 (మన వార్త ప్రతినిధి, పి. ఆంజనేయులు గౌడ్) 44వ జాతీయ రహదారి సర్వీస్ రోడ్ల తో పాటు ఇరువైపులా ఉన్న కల్వర్ట్లను నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. తూప్రాన్ బైపాస్ లోని హైటెక్ దాబా వద్ద కల్వర్టు నుండి వర్షపు నీరు వెళ్లకుండా పెద్ద గోతి తీయడంతో నీరు రోడ్లపై నిలిచిపోయిన దృశ్యాన్ని నేరుగా చూసి స్థానిక సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాబా నిర్వాహకులను పిలిచి అపరిశుభ్రతపై ప్రశ్నించారు. చెత్తాచెదారాన్ని తొలగించుకుంటే సంబంధిత నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా సర్వీస్ రోడ్లను ఆక్రమించిన వారికి నోటీసులు జారీ చేస్తామన్నారు. వెంటనే ఆక్రమణలు తొలగించాలని నేషనల్ హైవే ప్రాజెక్ట్ మేనేజర్ రాజేందర్ ను ఆదేశించారు. సర్వీస్ రోడ్లపై రియల్ ఎస్టేట్ చేస్తామంటే ఊరుకోబమని తీవ్ర స్థాయిలో ఆయన మండిపడ్డారు. సర్వీస్ రోడ్లకు ఇబ్బంది కలగకుండా మినిస్టర్ ఆఫ్ రోడ్ సర్వీసెస్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అనుమతితో రియల్ ఎస్టేట్ వ్యాపారులు డెవలప్మెంట్ చేసుకోవచ్చని పిడి సూచించారు.

Leave a Comment