- సిపిఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్.
తెలంగాణస్టేట్ బ్యూరో భాస్కర్ చారి, జూన్ 13 మనవార్త.
చేవెళ్ల పట్టణ కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేవెళ్ల ఆర్డిఓ కి అనుమతి లేకుండా నడుస్తున్న త్రిపుర రిసార్ట్ ను సీజ్ చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ చేవెళ్ల మండల పరిధిలోని వీర్లపల్లి రెవెన్యూ పరిధిలో అనుమతి లేకుండా నడిపిస్తూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న త్రిపుర రిసార్ట్ యాజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకొని సీజ్ చేయాలని ఆర్డీవో మేడం కి విజ్ఞప్తి చేశారు. ఈర్లపల్లి 111 జీవో పరిధిలోకి వస్తుందని అక్కడ రిసార్ట్‌లకు ఎలాంటి అనుమతి ప్రభుత్వం ఇవ్వలేదు. అనుమతి లేకుండా నడుస్తున్న త్రిపుర రిసార్ట్ అధికారులు ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు వెంటనే త్రిపుర రిసార్ట్‌ను సీజ్ చేయాలని లేనిపక్షంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కమ్ సభ్యుడు ఎర్రవల్లి శ్రీనివాస్, కెవిపిఎస్ నాయకులు ఉప్పరి చంద్రశేఖర్ ఎస్ఎఫ్ఐ చేవెళ్ల మండల కార్యదర్శి చందు తదితరులు పాల్గొన్నారు.