గంజాయి కేసులో ప్రధాన నిందితుడు వేముల జాన్ అతని అనుచరులు అరెస్ట్.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జూన్ 14, మనవార్త.

విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజ్గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్ అదేశాలు మేరకు మల్కాజ్గిరి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ ముకుంద రెడ్డి ఆధ్వర్యంలో ఘట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గంజాయి కి సంబంధించి వివిధ ప్రాంతాలలో సోదాలు చేయడం జరిగింది. గంజాయి కేసు నమోదు చేయడమైనది. చెంగిచెర్ల చెరువు సమీపంలో గంజాయి విక్రయిస్తున్న నిందితులను వేముల జాన్, అథవ నాగేశ్వర్ రావు, మనీష్ ఉధ్యాయ్, జూపల్లి రవితేజ దాసరి విశాల్, అరెస్టు చేసి 10.440 కేజీల గంజాయి, రెండు బైకులు ఒక కారు సీజ్ చేయడం జరిగిందన్నారు. ఇట్టి దాడులలో రవి సిఐ, నందిని ఎస్సై, సంగీత ఎస్సై, ఘట్కేసర్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Comment