వరంగల్ రీజినల్ ఇంజినీరింగ్ కళాశాల (ఎన్ఐటి) లో ఎంటెక్‌ చదువుతూ నక్సలిజం వైపు పయనించిన నంబాల కేశవ రావు…

వరంగల్ (మనవార్త ప్రతినిధి): బుదవారం ఉదయం బీజాపూర్ ఛత్తీస్గఢ్,నారాయణపూర్ లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన నంబాల కేశవరావు మరో పేరు బసవరాజు.2018 నవంబర్‌లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా తర్వాత అతను పార్టీకి సుప్రీం కమాండర్ అయ్యారు. కేశవరావుది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామం.తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడు. కేశవరావుకు సోదరుడు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు.బీజాపూర్‌ ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు సం:70 అలియాస్‌ బసవరాజు … Read more

తెలంగాణ ఉద్యమంలో టీజేఎఫ్ పాత్ర కీలకం…

-టీజేఎఫ్ రజతోత్సవ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ విప్ ఆది… మనవార్త : తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నిర్వహించిన చారిత్రాత్మక పాత్రను తెలియజేయడం కోసం మే 31 న టీజేఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రజతోత్సవ పోస్టర్ ను మంగళవారం రోజున వేములవాడలో రవాణా,బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వివిధ ప్రజా సంఘాలను రాజకీయ పార్టీలను, … Read more

కొండగట్టులో వైభవంగా ప్రారంభమైన పెద్ద జయంతి వేడుకలు…

మల్యాల,మే 20(మన వార్త ప్రతినిధి) ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయంలో హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు నేటి నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా నేడు భద్రాచలం శ్రీ సీతారాముల ఆలయం నుంచి వచ్చిన పట్టు వస్త్రాలను స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం డప్పు చప్పుల్ల నడుమ స్వామివారికి సమర్పిస్తున్నారు. కళాకారులు ప్రదర్శించిన వివిధ కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు … Read more

శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి…

మే 19(మనవార్త) వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ నుంచి ఆదివారం రాత్రే వేములవాడకు చేరుకున్న భక్తులు సోమవారం ఉదయం ఆలయ ధర్మగుండంలో స్నానమాచరించిన అనంతర స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో స్వామి వారి దర్శనానికి ఐదు గంటలు పట్టిందని భక్తులు తెలిపారు. స్వామి వారి ప్రసాదం కౌంటర్, కోడెల టికెట్‌ కౌంటర్లు భక్తులతో నిండిపోయాయి. రద్దీ కారణంగా గర్భగుడి దర్శనం నిలిపివేసి లఘుదర్శనం … Read more

మార్కెట్ యార్డులో వరి ధాన్యాన్ని పరిశీలించిన వంటేరు ప్రతాప్ రెడ్డి…

గజ్వేల్ మే 19,(మన వార్త ప్రతినిధి జీ మురళి)bగజ్వేల్ లోని మార్కెట్ యార్డులో వరి ధాన్యాన్ని పరిశీలించిన గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి0ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం లో రోడ్ల వెంబడి కొన్ని వేల క్వింటాళ్ల వరి ధాన్యం రోడ్లమీద ఉందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వారి ధాన్యం కొనడంలో విఫలమైందని తెలిపారు మార్కెట్ యార్డులలో రోడ్ల వెంబడి ఎక్కడ చూసినా వరి ధాన్యమే కనిపిస్తుందని కనీసం కాంగ్రెస్ … Read more

నకిలీ విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి

-నకిలీ విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలి: సీఎం… మే16(మనవార్త) తెలంగాణ వ్యవసాయశాఖ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఉన్నాతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. వానాకాలం పంటలకు సన్నద్ధమవ్వాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. నకిలీ విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

స్వరాజ్య వేదిక ద్వారా రైతుకుటుంబానికి రూరల్ డెవలప్మెంట్ సర్వీసు సొసైటీ తరఫున ఆర్థిక సహాయం…

మనవార్త :కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం చిన్నకొమటిపల్లి గ్రామానికి చెందిన చెందిన ముక్క సదయ్య కౌలు రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. భూమిని కౌలు తీసుకొని పత్తి సాగు చేసినాడు. పంట దిగుబడి రాకపోవడం వలన 4 లక్షల వరకు అప్పులు అయినాయి. తెచ్చిన అప్పు తీర్చే మార్గం లేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇతనికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అట్టి కుటుంబాన్ని రైతు స్వరాజ్య … Read more

అప్పుల బాధ తాళలేక యువకుడు ఆత్మహత్య…

ఇల్లంతకుంట మే 16 (మన వార్త ప్రతినిధి):రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని జవారిపేట గ్రామానికి చెందిన మేరుగు సంతోష్ (35) సంవత్సరాలు శుక్రవారం రోజున అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మృతుడికి భార్య ఒక కొడుకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.మృతుడి భార్య జ్యోతి తెలిపిన వివరాల ప్రకారం మాకు చిన్నపాటి కిరాణం షాప్ ఉన్నందున నడిపించుకుంటూ నా భర్త సంతోష్ గూడ్స్ ఆటో నడిపేవాడు మండలంలోని పలు గ్రామాలలో పత్తి వ్యాపారం … Read more

ఖననం చేసేందుకు తల్లి చేతిలో చిల్లిగవ్వ లేక..గుండెలవిసేలా రోదించిన తల్లి…

ములుగు,మనవార్త అనారోగ్యంతో ప్రభుత్వ దవాఖానకు వచ్చిన కొడుకు మృతి చెందగా, పాడె మోసేందుకు నలుగురు లేక, ఖననం చేసేందుకు తల్లి చేతిలో చిల్లిగవ్వ లేక, పిడికెడు పూలను కొడుకు శవం మీద చల్లి చేతులెత్తి మొక్కి పంచాయతీ సిబ్బందితో కాటికి సా గనంపింది.ములుగు జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన లచ్చమ్మ ఒక్కగానొక్క కొడుకు రాజు (20) ఈనెల 14 తెల్లవారుజామున చేతి మణికట్టు వద్ద కత్తితో కోసుకున్నాడు. గాయపడిన … Read more

గుడ్‌న్యూస్‌.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం.. ఒకేసారి మూడు నెలల రేషన్‌..!!

హైదరాబాద్‌ మనవార్త: వర్షాకాలంలో తిండి గింజల నిల్వ, రవాణాలో అంతరాయాలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.జూన్‌ నుంచి మొదలయ్యే వర్షాకాలం, వరదల వంటివి రాష్ట్రాలకు అడ్డంకులుగా మారవచ్చన్న అంచనాల నేపథ్యంలో, అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఆగస్టు 2025 వరకు అవసరమైన తిండి ధాన్యాలను ముందస్తుగానే లిఫ్టింగ్‌ చేసి, పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. మూడు నెలల కోటాను ఒకేసారి … Read more