కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ అశోక్ సస్పెండ్……

కుత్బుల్లాపూర్ ఆగష్టు 23( మన వార్త ప్రతినిధి రాజు)మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సబ్రిజిస్ట్రార్ అశోక్ కుమార్ సస్పెండ్ అయ్యారు. బాచుపల్లి లో సర్వే నెంబర్ 83 భూ నిషేధం లో ఉన్న భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసినందుకు ఉన్నత అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నిషేధిత భూమి బదిలీలో భారీగా నగదు చేతులు మారినట్లు సమాచారం. కోట్లు విలువ చేసే భూమిని సబ్ రిజిస్ట్రార్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ తగ్గించారని 22ఏ … Read more

వెంకటాపురం డివిజన్‌లో రోడ్లపైనే పార్కింగ్ – ప్రజలకు ఇబ్బందులు…..

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆగస్టు 22 మన వార్త : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని వెంకటాపురం డివిజన్ ప్రాంతంలో పలు కమర్షియల్ సంస్థలు రోడ్లపైనే పార్కింగ్ చేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రాచర్ల కిచెన్స్, పంజాబీ తడక వంటి హోటళ్లు, చైనీస్ ఫాస్ట్ ఫుడ్, ఐస్‌క్రీమ్ పార్లర్ వంటి వ్యాపార సంస్థలు రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని వాణిజ్య లాభాలు పొందుతున్నాయి. ఫలితంగా రోడ్లపై అక్రమ నిర్మాణాలు పెరిగి, వాహనదారులకు రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి.కాలనీ వాసులు మాట్లాడుతూ,కాలనీ … Read more

రహదారుల నిర్లక్ష్యం–విద్యార్థుల ఇబ్బందులు..ఎన్‌హెచ్‌ఆర్‌సి మండల అధ్యక్షుడు కాసుపాక శ్రీనివాస్ ఆవేదన….

.ఇల్లంతకుంట,ఆగస్టు 23 (మన వార్త ప్రతినిధి):రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్‌పేట గ్రామానికి వెళ్లే రహదారులు బాగా దెబ్బతిన్నాయి.అనంతారం,వెల్జిపూర్,ఓబులాపూర్ గ్రామాల నుండి రోజూ దాదాపు 400 మంది విద్యార్థులు తెలంగాణ మోడల్ స్కూల్‌కి ఆటోలు,బస్సులలో వస్తున్నారు.రోడ్డు పరిస్థితి చాలా దుర్భరంగా ఉండటంతో ప్రయాణం కష్టమైపోతోంది.వర్షాకాలంలో బురద,గుంతల వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.“ప్రభుత్వాలు మారుతున్నా రహదారులు మాత్రం అలాగే ఉన్నాయి.వెంటనే మరమ్మత్తులు చేయాలి,”అని ఎన్‌హెచ్‌ఆర్‌సి మండల అధ్యక్షుడు కాసుపాక శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో ఆవేదన … Read more

అనంతారంలో ఉపాధి హామీ పనుల జాతర…వంద రోజులు పూర్తి చేసిన కూలికి సన్మానం,భూమి పూజలతో కొత్త పనులకు శ్రీకారం…

.ఇల్లంతకుంట ఆగస్టు 22 (మన వార్త ప్రతినిధి):ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనుల జాతర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ స్పెషల్ అధికారి ఎంపిడిఓ శశికళ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రజలకు ఆర్థిక భద్రతను అందించే ముఖ్య పథకమని అన్నారు.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ అధికారి విజయలక్ష్మి పనుల జాతర కార్యక్రమంలో శుక్రవారం ఇంకుడు గుంత పనులకు భూమి పూజ నిర్వహించి,ఉపాధి హామీ పథకంలో … Read more

ఫాదర్ బాలయ్య నగర్‌లో పొలిమేరాస్ కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో ఆందోళన…..

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఆగస్టు 21 మన వార్త :అల్వాల్ సర్కిల్ ఫాదర్ బాలయ్య నగర్‌ లో ఉన్న పొలిమేరాస్ షాప్‌లో పని చేస్తున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.షాప్ యాజమాన్యం గత రెండు నెలలుగా అక్కడ పని చేస్తున్న కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అందులో పనిచేస్తున్న మహిళలు ఒక్కొక్కరు రూ.12,000 చొప్పున పది మంది కార్మికులు తమ వేతనాలు పొందలేదని బాధతో తెలిపారు.జీతాలు ఇవ్వకపోవడంతో నిరాశకు గురైన బాధితులు చివరికి పోలీసులను … Read more

శుక్రవారం జరిగే వైద్య శిభిరంకు ప్రభుత్వ విప్ కు ఆహ్వానం…

వేములవాడ ఆగష్టు 21 (మన వార్త ప్రతినిధి ) వేములవాడ టియుడబ్ల్యూజే హెచ్ 143 ప్రెస్ క్లబ్ పాత్రికేయులు మంగళవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహామ్మద్ రఫీక్ శుక్రవారం రోజున జరిగే ఉచిత మెగా వైద్య శిబిరానికి రావాలని ప్రభుత్వ విప్ కు ఆహ్వానం పలికారు.వైద్య శిబిర నిర్వహణపై క్లుప్తంగా వివరించారు. దీనిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు. … Read more

సుచిత్ర జంక్షన్‌లో ట్రాఫిక్ సవరణలు – ప్రజల సౌకర్యం కోసం ప్రత్యేక చర్యలు….

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆగస్టు 20 మన వార్త : ప్రజల అభ్యర్థన మేరకు, వారి విలువైన సమయాన్ని ఆదా చేయడం, ప్రమాదంలో గాయపడిన వారికి అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అంబులెన్స్ రాకపోకలకు ప్రాధాన్యత కల్పించడం, అలాగే శబ్ద, గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు సీనియర్ అధికారుల అనుమతితో సుచిత్ర జంక్షన్‌ను మూసివేసి ట్రాఫిక్ సవరణలు చేపట్టారు అని మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ తెలిపారు.ఈ క్రమంలో అల్వాల్ వైపు నుండి వచ్చే వాహనదారులు పిల్లర్ నెం. 45 … Read more

కారు బైకు ఢీకొని ఒకరు మృతి….

గంభీరావుపేట. ఆగస్టు 20 మన వార్త ప్రతినిధి.✍️మధ్యాహ్నం 02:30 గంటల సమయంలో పాల్వంచ మర్రి గ్రామం కు చెందిన కడమంచి వెంకటి సముద్ర లింగాపూర్ కు వెళ్లి తన యాక్టివా పై బండి నెంబర్ TS17H 9828 గలదానిపై తిరిగి ఇంటికి వచ్చుచుండగా మార్గమధ్యంలో పెద్దమ్మ స్టేజి మూల మలుపు వద్ద ఎదురుగా కారు నెంబర్ TS 23G0580 గల కారు అతివేగంగా అజాగ్రత్తగా నడిపి యాక్టివాకు టక్కరు ఇవ్వగా వెంకటికి రక్తగాయములు కాగా చికిత్స గురించి … Read more

మచ్చబొల్లారం అక్బర్జిగూడా ముస్లిం గ్రేవియార్డ్ వద్ద ఆందోళన….

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మన వార్త :మచ్చబొల్లారం అక్బర్జిగూడా ముస్లిం గ్రేవియార్డ్ వెనుకభాగంలోని కాంపౌండ్ వాల్ దెబ్బతినడంతో సమస్యలు తలెత్తాయి. పైగా, గ్రేవియార్డ్ పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ నుండి మురికినీరు లోపలికి వదలడంతో తీవ్ర ఆందోళనకు దారితీసింది.ఈ ఘటనపై గ్రేవియార్డ్ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డంపింగ్ యార్డ్ వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.హిందువుల స్మశానవాటికను తొలగించిన తర్వాత, ఇప్పుడు మా ముస్లిం గ్రేవియార్డ్ పైన కూడా ఇలాంటి చర్యలు … Read more

అల్వాల్ చెరువు కట్ట ఫై వీధి దీపాలు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది…..

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆగస్టు 19 మన వార్త : అల్వాల్ చెరువు కట్ట పరిధిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువు కట్టపై రహదారి పరిస్థితి రోజు రోజుకీ అధ్వాన్నంగా మారుతోంది. రోడ్లంతా గుంతలతో నిండిపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో లైటింగ్ సదుపాయం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. చీకటిలో వాహనదారులు, పాదచారులు గుంతల్లో పడిపోతూ ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు జరుగుతున్నాయి.చెరువు కట్ట రహదారి అల్వాల్ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్యమైన … Read more