భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి…-హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్…

(జమ్మికుంట,మనవార్త) భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,వరద ప్రభావిత ప్రాంతాలపై అధికారులు దృష్టిసారించాలని సూచించారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్.ఈ మేరకు గురువారం ఉదయం 2 పట్టణాల కమిషనర్లు,వివిధ మండలాల అధికారులతో ఫోన్ లో సంభాషించారు.వీలైనంత వరకు వరద నీరు నిలవకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.మరోవైపు వినాయక మండపాల వద్ద నిర్వాహకులు జాగ్రత్తగా వ్యవహరించాలని,కరెంట్ స్తంభాలు ఇతరత్ర సరి చూసుకోవాలనీ, రైతులు కరెంట్ పెట్టే సమయంలో చూసుకోవాలని కోరారు.వాతావరణ అధికారుల సూచన మేరకు మరో మూడు రోజులు భారీ వర్షాల నేపధ్యంలో అవసరమైతే తప్ప ఇంట్లో నుండి బయటికి ఎవరు రాకూడదని కోరారు.లోతట్టు ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు కూడా తగిన సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని కోరారు.

Leave a Comment