మల్కాజ్గిరి నియోజకవర్గంలో మట్టి గణపతుల కొరత – భక్తులు ఆందోళన…..

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆగస్టు 26 మన వార్త : మల్కాజ్గిరి నియోజకవర్గం, అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలో వినాయక చవితి వేడుకలు సమీపిస్తుండగా, మట్టి గణపతుల విగ్రహాల కొరత తీవ్రంగా కనిపిస్తోంది.ప్రతి ఏటా కార్పొరేటర్లు, జిహెచ్ఎంసి అధికారులు సమన్వయంతో మట్టి గణపతులను పంపిణీ చేస్తుండగా, ఈసారి తగినంత విగ్రహాలు అందుబాటులో లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. పర్యావరణ హితమైన మట్టి గణపతులు లేకపోవడంతో అనేక కుటుంబాలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. చెరువులు, కుంటల్లో కాలుష్యం పెరగకుండా ప్రభుత్వం, పర్యావరణ సంస్థలు మట్టి గణపతులను వినియోగించమని ప్రతి సంవత్సరం పిలుపునిస్తూనే ఉన్నా, మార్కెట్‌లో సరిపడా విగ్రహాలు లభించకపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రజల డిమాండ్ జిహెచ్ఎంసి అధికారులు,సంబంధిత విభాగాలు ముందుకు వచ్చి సరఫరా చర్యలు చేపట్టాలి.మట్టి గణపతులు సకాలంలో అందుబాటులోకి రావాలి.భవిష్యత్తులో ఇలాంటి కొరతలు రాకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలి.

Leave a Comment