- మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీహిల్స్లో దారుణం చోటు చేసుకుంది.
తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, ఆగస్టు 25, మనవార్త.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం.గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసాడో భర్త. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి (25), మహేందర్ ప్రేమవివాహం చేసుకొని బోడుప్పల్లో నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భార్య హతమార్చి.. అనంతరం శరీరభాగాలను కవర్లో
ప్యాక్ చేసి.. బయటకు తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమయ్యాడు. గది నుంచి శబ్దాలు రావడంతో పొరుగింటి వ్యక్తులు వెళ్లి చూశారు. కవర్లో ఉన్న శరీర భాగాలను గుర్తించి పోలీసులకు సమాచారo ఇవ్వడంతో విషయం బయటపడింది. నిందితుడు మహేందర్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో స్వాతి కాళ్లు, చేతులు, తల వేరు చేసి మూసీలో వేసినట్లు మహేందర్రెడ్డి చెప్పడంతో వాటి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఛాతీ భాగాన్ని మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.