ఇల్లంతకుంటలో కుండపోత వర్షం – గాలిపల్లి ఎస్సీ కాలనీ జలమయం…ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు…

ఇల్లంతకుంట, ఆగస్టు 27 (మన వార్త ప్రతినిధి):ఇల్లంతకుంట మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.ముఖ్యంగా గాలిపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ పూర్తిగా నీటమునిగిపోవడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఎస్.ఏ.ఫారూఖ్,ఎంపీడీవో శ్రీనివాస్,సీఐ మొగిలి,ఎస్సై సిరిసిల్ల అశోక్ మరియు ఇతర శాఖల అధికారులు బుధవారం రాత్రి సమయంలో వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.నీటిమునిగిన ప్రాంతాల్లోని కుటుంబాలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తూ రెవెన్యూ, పోలీస్,గ్రామ పంచాయతీ సిబ్బంది హై అలర్ట్‌లో పనిచేస్తున్నారు.కాలనీవాసులను గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు తరలించగా,అధికారులు ప్రజలకు నీటిమీదుగా ప్రయాణించవద్దని హెచ్చరించారు.వర్షం కొనసాగుతుండటంతో వరద ఉధృతి పెరిగే అవకాశముందని అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

Leave a Comment