ఎల్కతుర్తి ఆగస్టు 27 మన వార్త ప్రతినిధి ఎల్కతుర్తి మండలంలోని కోతులనడుమ సమీపం వద్ద ఎన్.హెచ్ 563 నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హుజురాబాద్ నుంచి వస్తున్న TS02 EV 9009 నంబరు గల కారు, ఎల్కతుర్తి కి వస్తుండగా..ఎల్కతుర్తి మండలం దండపెల్లి గ్రామానికి చెందిన సంపత్ నడుపుతున్న ఆటోను ఢీకొట్టింది.ఆటోలో ప్రయాణిస్తున్న వారు వల్బాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వారితో పాటు బీహార్ రాష్ట్రానికి చెందిన రోడ్ వర్కర్లు కూడా ఉన్నారు.ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు వెంటనే చికిత్స కోసం అంబులెన్సు లో దవాఖానకు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తదుపరి వివారాలు తెలియాల్సి ఉంది.