రిజర్వేషన్లు మార్చకుంటే ఎన్నికలను బహిష్కరిస్థాం… గ్రామ ప్రజల తీర్మానం….

చిన్న శంకరంపేట నవంబర్ 24 ( మన వార్త ప్రతినిధి )చిన్న శంకరంపేట మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో వార్డుల రిజర్వేషన్లను అధికారులు ఇష్టం వచ్చినట్లు సవరించి బీసీలకు అన్యాయం చేస్తున్నారని గ్రామ ప్రజలు ఆరోపించారు సోమవారం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి వార్డుల్లో వచ్చిన రిజర్వేషన్లను పరిశీలించి అవక తవకలు జరిగాయని గతంలో వచ్చిన రిజర్వేషన్లకు ఇప్పుడు వచ్చిన రిజర్వేషన్లకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని గతంలో ఒకటో వార్డు నుండి ఐదవ వార్డ్ వరకు బీసీ … Read more

అదుపుతప్పి డివైడర్ ని ఢీ కొట్టిన కారు ఇద్దరు యువకులకి స్వల్ప గాయాలు….

బెజ్జంకి,నవంబర్ 25 (మన వార్త రిపోర్టర్) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లా లాపూర్ స్టేజ్ వద్ద రాజీవ్ రహదారిపై మంగళవారం ఉదయం హైదరాబాదు నుండి కరీంనగర్ వెళ్తున్న కారు అదుపు తప్పి గాగిల్లపూర్ స్టేజ్ వద్ద స్టేజ్ డివైడర్ ని ఢీ కొట్టింది.కారులో ఉన్న ఇద్దరు యువకులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు అతివేగం ప్రమాదానికి కారణమని తెలిపారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అక్రమంగా నిలువ ఉంచిన ఇసుకడంపు సీజ్ చేసిన అధికారులు..

. నిజాంపేట నవంబర్ 24( మన వార్త ప్రతినిధి ) నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామంలో నమ్మదగిన సమాచారం మేరకు గ్రామంలోని గొల్ల బిక్షపతి పౌల్ట్రీ ఫార్మ్ వద్ద ఉన్న అక్రమ ఇసుక డంపును స్థానిక తహశీల్దార్ తో పాటు ఎస్ఐ రాజేష్ సిజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై రాజేష్ మాట్లాడుతూ ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడ్డా నిల్వ ఉంచిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎవరు కూడా అక్రమంగా ఇసుక నిలువ ఉంచితే … Read more

సొసైటీ అక్రమాలపై విచారణ చేపట్టిన అధికారులు…

చిన్న శంకరంపేట నవంబర్ 24 ( మన వార్త ప్రతినిధి )చిన్న శంకరంపేట మండలంలోని చందంపేట సహకార సంఘంలో నిధుల దుర్వినియోగం తో పాటు రైతుల డబ్బులను సీఈవో పాషాకాజేసిన విషయంపై సోమవారం డిసిఓ కార్యాలయ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అధికారి తుకారం విచారణ చేపట్టగా రైతుల నుండి సహకార సంఘం సీఈవో పై ఆరోపణలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి, రైతుల ఖాతాల నుండి నేరుగా డబ్బులు డ్రా చేయడంతో పాటు సకాలంలో రుణాలు చెల్లించిన వారికి వచ్చే … Read more

వెంకట్రావుపల్లిలో బీసీలు లేమా అంటున్న గ్రామస్తులు…**-443 బీసీలు ఉన్నప్పటికీ ఒక్క బీసీ వార్డు కేటాయించకపోవడంతో వెంకట్రావుపల్లె గ్రామంలో ఆందోళన…

ఇల్లంతకుంట,నవంబర్ 24 (మన వార్త ప్రతినిధి)ఇల్లంతకుంట మండలంలో సోమవారం సర్పంచ్-వార్డు మెంబర్ల రిజర్వేషన్ల లిస్టును గెజిట్ ముద్రతో ప్రభుత్వం విడుదల చేసిన లిస్టు చూసి,మండలంలోని వెంకట్రావుపల్లె గ్రామానికి చెందిన అనగోని యాదగిరి గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా యాదగిరి గౌడ్ మాట్లాడుతూ “మా గ్రామంలో 443 మంది బీసీలు,138 మంది ఎస్సీలు,34 ఓసీలు,5 ఎస్టీలు ఉన్నప్పటికీ ఒక్క బీసీ వార్డూ కేటాయించలేదు.ఏ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఈ లిస్టు రూపొందించబడింది..?”అని అధికారులు తెలియజేయాలని కోరారు.“మా హక్కులను … Read more

అల్వాల్‌లో యూపీ యువకుడు అదృశ్యం – కుటుంబ సభ్యుల్లో ఆందోళన….

.మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నవంబర్ 24 మన వార్త : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సీతాపూర్‌కు చెందిన మొహమ్మద్ ఆసిఫ్ (25) అల్వాల్‌లో అదృశ్యమైన సంఘటన కలకలం రేపుతోంది.పని నిమిత్తం ఈ నెల 14న విజయవాడ పారిశ్రామిక వాడకు వచ్చిన ఆసిఫ్, పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉందని 19వ తేదీన అల్వాల్ రాజీవ్ విహార్ సెక్షన్‌లో ఉన్న బంధువు నిహాల్ ఇంటికి వచ్చాడు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న ఆసిఫ్ అనంతరం బయటికి వెళ్లి తిరిగి రాలేదు. రెండు … Read more

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం….

చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2009-2010 వ బ్యాచ్‌కి చెందిన పదో తరగతి విద్యార్థుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరి గత స్మృతులను, జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరునొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తమ స్థితి గతులను ఒకరితో ఒకరు పంచుకున్నారు. పిల్లాపాపలతో కుటుంబ సమేతంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా కబుర్లు చెప్పుకున్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,పాఠశాల కు దూరమై 14 సంవత్సరాలు … Read more

అనంతారం గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ..**మహిళా శక్తికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా……

ఇల్లంతకుంట,నవంబర్ 23 (మన వార్త ప్రతినిధి)రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామంలో ఆదివారం గ్రామ మహిళ సంఘం సభ్యులు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ మాజీ సర్పంచ్,మండల ఫోరం అధ్యక్షులు చల్ల నారాయణ,మాజీ ఎంపీటీసీ,జిల్లా మహిళ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు తీగల పుష్పలత పాల్గొన్నారు.ఈ సందర్భంగా పుష్పలత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని తెలిపారు.మహిళలను కోటీశ్వరులను చేయడమే … Read more

అదుపు తప్పి ఆటో బోల్తా.. ఇద్దరికీ గాయాలు….

బెజ్జంకి,నవంబర్ 23( మన వార్త ప్రతినిధి ) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి గ్రామానికి చెందిన మహిళలు బెజ్జంకి సత్య అర్జున ఫంక్షన్ హాల్లో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరిట ఇందిరమ్మ మహిళ శక్తి చీరలను పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చీరలు తీసుకొని వెళ్తున్న క్రమంలో దాచారం స్టేజి వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న దేవకపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి.స్థానికులు 108 కి సమాచారం అందించి క్షతగాత్రులను … Read more

ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి…మంత్రి ఫోన్ చేసి భరోసా.**దుఃఖంతో మాట్లాడుతున్న బాలరాజుకు ధైర్యం చెప్పిన రవాణా శాఖ మంత్రి..**నిందితుడికి కఠిన చర్యలు తప్పవని స్పష్టం..

ఇల్లంతకుంట,నవంబర్ 21 (మన వార్త ప్రతినిధి); రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట–సిరిసిల్ల రహదారిలో వల్లంపట్ల గ్రామం వద్ద రెండు రోజుల క్రితం జరిగిన ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది.సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కల్లూరి బాలరాజుపై..ఓ వ్యక్తి “నా కారుకు సైడ్ ఇవ్వలేదంటూ” అమానుషంగా దాడి చేయడంతో ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.సంఘటనకు సంబంధించిన వీడియోలు,ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో “మన తండ్రిలాంటి ఆర్టీసీ డ్రైవర్‌ను ఇలా తన్నడం,కొట్టడం … Read more