ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసినసిద్దిపేట కలెక్టర్ హైమావతి..

బెజ్జంకి,డిసెంబర్ 23, ( మన వార్తా ప్రతినిధి )సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, హాస్పటల్ లోనిఅటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేస్తూ ల్యాబ్ టెక్నీషియన్, ఎంపిఎచ్ ఓ, అటెండర్ సంతకాల చేయలేదని ఆరా తియ్యగా ల్యాబ్ టెక్నీషియన్, ఎంపిఎచ్ ఓ సెలవులో ఉన్నారని అటెండర్ రాత్రి సమయాల్లో డ్యూటీ చేస్తారని మెడికల్ ఆఫీసర్ కలెక్టర్ కి తెలపగా లీవ్ లెటర్ చెక్ చేసి,రిజిస్టర్ లో ఎవరెవరు ఎన్ని సెలవులు వాడుకున్నారో లెక్కించి బలమైన కారణం ఉంటే లీవ్ లెటర్ పెట్టీ పై అధికారి అనుమతి తర్వాతే సెలవు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఓపి రిజిస్టర్ వెరిఫై చేస్తూ రోజు వారిగా 24/7 పి ఎచ్ సి కావున ప్రతి ఒక్క రోగి వివరాలను రిజిస్టర్ లో రాయాలని మెరుగైన వైద్యం అందించాలని మెడికల్ ఆఫీసర్ సిబ్బందిని ఆదేశించారు. పి ఎచ్ సి కి వచ్చిన రోగులతో మాట్లాడుతూ.. తీవ్ర మైన చలి వల్ల షుగర్, బీపీ వ్యాధులు రాకుండా డాక్టర్ ఇచ్చిన సలహాలు సూచనలు మందులు వాడాలని, అన్నం తినడం తగ్గించాలని రాగి జావా, పండ్లు తినాలని, క్యారెట్, బీట్రూట్ వంటి పోషక విలువలు గల పదార్థాలను తినాలని నీరు ఎక్కువగా తాగాలని తెలిపారు.

Leave a Comment