చలో కలెక్టరేట్ ను విజయవంతం చేయండి*–252 జీవోను సవరించే వరకు పోరాటం ఆగదు.–జర్నలిస్టులు హక్కులను కాల రాస్తామంటే సహించేది లేదు.–టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా….

వేములవాడ,డిసెంబర్ 26 : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టి యు డబ్ల్యూ జే హెచ్ 143 రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తలపెట్టిన ఈనెల 27న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టి యు డబ్ల్యూ జే రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం విడుదల చేసిన నూతన జీవో 252 వర్కింగ్ జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ఉందని మండిపడ్డారు. నూతన జీవో ప్రకారం డెస్క్ జర్నలిస్టులు, కేబుల్ జర్నలిస్టులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హక్కులను, సంక్షేమాన్ని కాలరాసే విధంగా ప్రభుత్వం అనుసరించినట్లయితే సహించేది లేదని ధ్వజమెత్తారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులను గత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో విస్మరించారన్నారు. మెజారిటీ జర్నలిస్టుల సహకారంతో అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం అంతకంటే దారుణంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. నూతనంగా విడుదల చేసిన జీవో నెంబర్ 252 ను వెంటనే సవరించని యెడల రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ నేతృత్వంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృత పరుస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు రేగుల రాంప్రసాద్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మొహమ్మద్ రఫీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కొలిపాక నరసయ్య, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు సయ్యద్ అలీ, అబ్దుల్ జబ్బర్, దేబ్బేటి ప్రవీణ్, చేకూర్త్తి నవీన్ లు పాల్గొన్నారు.

Leave a Comment