బెతాని అకాడమీలో ఘనంగా నేషనల్ మ్యాథమెటిక్స్ డేవిద్యార్థుల మోడల్స్, ప్రాజెక్టులతో ఆకట్టుకున్న వేడుకలు….

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిసెంబర్ 23 మన వార్త :ఆల్వాల్‌లోని బెతాని అకాడమీ విద్యాసంస్థలో నేషనల్ మ్యాథమెటిక్స్ డే వేడుకలు అత్యంత ఉత్సాహంగా, వైభవంగా నిర్వహించారు. విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం అందరి మనసులను ఆకట్టుకుంది.ఈ సందర్భంగా విద్యార్థులు తమలోని ప్రతిభ, పనితనం, ఆలోచనా శక్తిని ప్రదర్శిస్తూ గణిత ప్రాధాన్యతను వివరించే చక్కటి మోడల్స్, ప్రాజెక్టులను రూపొందించి ప్రదర్శించారు. గణితం మన దైనందిన జీవితంలో ఎంతగా ముడిపడి ఉందో వివరిస్తూ విద్యార్థులు చూపిన సృజనాత్మకతను చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయి, పిల్లలను హృదయపూర్వకంగా అభినందించారు.గణితం కేవలం ఈక్వేషన్లు మాత్రమే కాదుఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లీనా వారణాసి మాట్లాడుతూ, జీనియస్ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న నేషనల్ మ్యాథమెటిక్స్ డేను నిర్వహిస్తున్నామని తెలిపారు. గణితం అనేది కేవలం సంఖ్యలు, ఈక్వేషన్లకే పరిమితం కాదని, అది సైన్స్, టెక్నాలజీలకు వెన్నెముక వంటిదని వివరించారు.మన జీవితం మొత్తం గణితంతోనే ముడిపడి ఉందని, ఉదయం నిద్రలేచిన వెంటనే మనం చూసేది సమయం అని, ఆ సమయం కూడా సంఖ్యలే అని పేర్కొన్నారు. వంట గది నుంచి కుటుంబ బడ్జెట్ వరకు, రోజువారీ లావాదేవీల నుంచి పెద్ద నిర్ణయాల వరకు గణితం ప్రతి అడుగులో భాగమై ఉందని చెప్పారు.లాజికల్ థింకింగ్‌కు గణితమే పునాదిప్రతి సంవత్సరం నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా విద్యార్థులకు గణిత ప్రాముఖ్యతను వివరించడమే కాకుండా, లాజికల్ థింకింగ్‌ను ఎలా పెంపొందిస్తుందో, సమస్యలను పరిష్కరించుకునే నైపుణ్యాన్ని ఎలా నేర్పిస్తుందో అవగాహన కల్పిస్తున్నామని ప్రిన్సిపల్ తెలిపారు. గణితంతో అద్భుతాలు సృష్టించవచ్చని, ప్రపంచాన్ని ఆశ్చర్యపరచవచ్చని విద్యార్థులకు వివరించారు.మేనేజ్మెంట్ సహకారంతో వినూత్న కార్యక్రమాలుఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడంలో పాఠశాల మేనేజ్మెంట్ నుంచి పూర్తి సహకారం అందుతుందని, ముఖ్యంగా డైనమిక్ లేడీ చైర్మన్ వనజ ఆల్వాల్ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ తమకు అండగా ఉంటారని ప్రిన్సిపల్ లీనా వారణాసి పేర్కొన్నారు. అందువల్లే విద్యార్థులకు ఉపయోగపడే విద్యా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు.పరీక్షలు, బహుమతులు, ఉపాధ్యాయుల సత్కారంఈ సందర్భంగా విద్యార్థులకు గణిత పరీక్షను నిర్వహించగా, అందులో ప్రతిభ కనబరిచిన మొదటి, రెండవ శ్రేణి విద్యార్థులకు బహుమతులు అందించి ప్రత్యేకంగా అభినందించారు. గణితం బోధిస్తున్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను మరింత ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని నేషనల్ మ్యాథమెటిక్స్ డే వేడుకలను విజయవంతం చేశారు.

Leave a Comment