బర్రెoకుల కుంటను కాపాడండి తహసిల్దార్ కు వినతి పత్రం అందచేసిన బిజెపి నాయకులు…

నార్సింగి డిసెంబర్ 22 ( మన వార్త ప్రతినిధి ) నార్సింగి శివారులోని షేర్ పల్లి గ్రామానికి వెళ్లే రోడ్డులో ఉన్న బర్రెoకల కుంట ను కాపాడాలని బిజెపి నాయకులు తహసిల్దార్ గ్రేసీ భాయ్ కి వినతి పత్రాన్ని అందజేశారు. నార్సింగి గ్రామ శివారులోని 624 సర్వే నెంబరు లో ఉన్న బర్రింకలకుంట విస్తీర్ణం ఎంత ఉన్నదో సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో బిజెపి నాయకులు అధికారులను కోరారు. కుంటను కబ్జా నుండి కాపాడి ప్రభుత్వ భూములను రక్షించుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షులు నర్సింలు, నాయకులు నరేష్, లింగారెడ్డి, గురుపాదం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment