రాజన్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై ముందస్తు కసరత్తు​ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా శివరాత్రి జాతర సన్నాహక సమావేశం….​

వేములవాడ డిసెంబర్ 30 (మన వార్త )

2026 ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు రాజన్న మహాజాతర: భీమేశ్వర సదన్‌లో సమీక్ష**​శివరాత్రి జాతరలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలి: విప్ ఆది శ్రీనివాస్*రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి మహాశివరాత్రి జాతర వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. 2026 ఫిబ్రవరి 14 నుండి 16 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ మహాజాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థాన అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జాతర నిర్వహణ మరియు భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించేందుకు ఈరోజు మంగళవారం ఉదయం వేములవాడలోని భీమేశ్వర సదన్ భవనంలో భారీ సన్నాహక సమావేశం నిర్వహించారు. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ మరియు జిల్లా ఎస్పీ మహేష్ బీ, గితేతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు హాజరై జాతర ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఆలయంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. మేడారం జాతరకు వెళ్లే భక్తులు సైతం జనవరి నుండే రాజన్న క్షేత్రానికి పోటెత్తుతారనే అంచనాతో ముందస్తుగా మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. పారిశుధ్యం, తాగునీరు, రవాణా మరియు విద్యుత్ సరఫరా వంటి అంశాల్లో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని ఇప్పటికే ప్రాథమిక ఆదేశాలు జారీ అయ్యాయి. ఆలయ అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సన్నాహక సమావేశంలో పాల్గొని జాతరను విజయవంతం చేసేందుకు అవసరమైన సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి, ఆలయ ఈవో రమాదేవి, పట్టణ సీఐ వీరప్రసాద్, రూరల్ సీఐ శ్రీనివాస్, అన్ని శాఖల అధికారులు, పట్టణ పుర ప్రముఖులు పాల్గొన్నారు..

Leave a Comment