మల్కాజిగిరి నియోజకవర్గంలో జిహెచ్ఎంసి డివిజన్ల పునర్విభజన – 9 నుంచి 16కు విస్తరణ….

.మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, డిసెంబర్ 10 మన వార్త : పట్టణ అభివృద్ధి, జనాభా పెరుగుదల, ప్రజా సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో జిహెచ్ఎంసి పరిపాలన విభాగాలను పునర్వ్యవస్థీకరించారు. ఇప్పటి వరకు 9 డివిజన్‌లుగా ఉన్న మల్కాజిగిరి ప్రాంతాన్ని ఇప్పుడు 16 డివిజన్‌లుగా విస్తరించారు. కొత్తగా ప్రకటించిన డివిజన్‌ల జాబితాను జిహెచ్ఎంసి అధికారులు విడుదల చేశారు.క్రొత్త డివిజన్‌ల వారీగా సంఖ్యలు – పేర్లు1. ఈస్ట్ ఆనంద్ బాగ్ – 1802. మీర్జాలగూడ – … Read more

రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం ద్విచక్ర వాహనదారుడికి గాయాలు….

బెజ్జంకి, డిసెంబర్ 9 (మన వార్త రిపోర్టర్ )సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బెజ్జంకి క్రాసింగ్ రాజీవ్ రహదారిపై వెళ్తున్న కోహెడ మండలం శనిగరం గ్రామానికి రాజు తన యొక్క టీవీఎస్ ఎక్సెల్ పై శంకర్ నగర్ – బెజ్జంకి క్రాసింగ్ వద్ద వేగంగా వెనుక నుంచి వస్తున్న పల్సర్ బైక్ ముందు పోతున్న ఎక్సెల్ బైక్ ని ఢీ కొట్టింది.ఎక్సెల్ పై వెళ్తున్న రాజుకు గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారని సమాచారం. పూర్తి వివరాలు … Read more

చెక్‌పోస్ట్ వద్ద బారికేడు ఢీకొట్టి కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు..నిందితులను పట్టుకున్న బెజ్జంకి ఎస్సై సౌజన్య…

.బెజ్జంకి,డిసెంబర్ 4 (మన వార్త ప్రతినిధి);బెజ్జంకి మండలం దేవక్కపల్లి స్టేజ్ ఎలక్షన్ చెక్‌పోస్ట్ వద్ద డ్యూటీలో ఉన్న ఎస్‌ఎస్‌టి సిబ్బందిని బుధవారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరు యువకులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది.చెక్‌పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడు‌ను ఢీకొట్టడంతో,విధి నిర్వహణలో ఉన్న రాజగోపాలపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ సిద్ధి రాములు పొట్ట భాగంలో తీవ్రంగా గాయపడ్డారు.ఘటన అనంతరం నిందితులు అక్కడినుంచి పారిపోయారు.తదుపరి,బెజ్జంకి మండలం స్థానిక ఎస్సై బి.సౌజన్య వెంటనే స్పందించి పారిపోయిన … Read more

రేపు శ్రీ దత్త పౌర్ణమి 12వ వార్షికోత్సవ వేడుకలు విజయవంతం చేయండి. గురూజీ డాక్టర్ శ్రీ దేవదాస్ స్వామి….

బోయినపల్లి మండలం డిసెంబర్ 03 ( మన వార్త ప్రతినిధి ) రేపు గురువారం శ్రీ దత్త పౌర్ణమి 12 వార్షికోత్సవ వేడుకలు బోయినపల్లి మండలం స్తంభంపల్లి సాయిబాబా ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నామని గురూజీ డాక్టర్ శ్రీశ్రీశ్రీ దేవదాసు స్వామి తెలిపారు ఇట్టి వార్షికోత్సవ వేడుకలకు పీఠాధిపతులు వస్తున్నారని ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని మరియు పల్లకి సేవ హోమం కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అనంతరం అన్న ప్రసాద వితరణ ఉంటుందని దేవదాసు స్వామి తెలియజేశారు.కావున భక్తులు … Read more

బెజ్జంకి రెవెన్యూ సిబ్బంది కారుకు ఢీకొట్టిన బొలోరో వాహనం…

*బెజ్జంకి,డిసెంబర్ 2 (మన వార్త):కరీంనగర్ జిల్లాలో మండలం ఇందిరానగర్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెవెన్యూ సిబ్బంది తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.హైదరాబాద్ నుండి కరీంనగర్ వైపు వస్తున్న బొలెరో వాహనం డివైడర్‌ను ఢీకొని,ఎదురుగా వస్తున్న బెజ్జంకి రెవెన్యూ సిబ్బంది ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొట్టి అనంతరం లోయలోకి దూసుకెళ్లింది.కారులో ప్రయాణిస్తున్న ఆర్‌ఐ సంతోష్,టైపిస్టు సంతోష్,జూనియర్ అసిస్టెంట్ శేఖర్,బెజ్జంకి హెడ్ కానిస్టేబుల్ గాయాలపాలయ్యారు.స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించగా,గాయపడిన వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి … Read more

ఆటోలో మర్చిపోయిన 18 తులాల బంగారం – అల్వాల్ పోలీసుల చురుకైన సంధానంబాధితురాలికి మూడు గంటల్లోనే బంగారు నగలను తిరిగి అప్పగించిన పోలీసులు….

.మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిసెంబర్ 2 మన వార్త : ఆంధ్రప్రదేశ్‌ లోని విజయవాడ నుంచి బొల్లారం తుర్కపల్లి ప్రాంతానికి గృహప్రవేశం కార్యక్రమం నిమిత్తం వచ్చిన షేక్ సనా తిరుగు ప్రయాణం కోసం సఫిల్ గూడ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. అయితే ట్రైన్ మిస్ కావడంతో రాత్రివేళ తిరిగి బొల్లారం తుర్కపల్లికి ఆటోలో చేరుకున్నారు. ప్రయాణంలో తీసుకొచ్చిన లగేజ్ మొత్తం ఇంటిలోకి తీసుకొచ్చినప్పటికీ, విలువైన బంగారు ఆభరణాలు ఉన్న ఒక ముఖ్యమైన బ్యాగ్ మాత్రం ఆటోలోనే మర్చిపోయారు.మరుసటి … Read more

జాలిగామ గ్రామంలో పోలీస్ కవాతు గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా జరుపుకోవాలని – ఎసిపి నర్సింలు…

గజ్వేల్ నవంబర్ 30 మన వార్త ప్రతినిధిగ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో గజ్వేల్ పోలీసు వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం గజ్వేల్ ఏసిపి నర్సింలు ఆధ్వర్యంలో పోలీసు కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు, ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, సమస్మాత్మక పోలింగ్ కేంద్రాలలో గట్టి నిఘ ఏర్పాటు చేయడం జరిగిందని,ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా పోలీసులకు … Read more

కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. రూ. కోటిపైగా ఆస్తినష్టం…

మల్యాల, నవంబర్ 30 (మన వార్త ప్రతినిధి)జగిత్యాల- కరీంనగర్ ప్రధాన రహదారిలోని కొండగట్టు దిగువన ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రాంతంలో శనివారంరాత్రి షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి సుమారు 30కి పైగా బొమ్మల దుకాణాలు దగ్ధమయ్యాయి. కాగా, మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో దుకాణాల నుంచి జనాలు బయటకు పరుగులు పెట్టారు. దీంతో బొమ్మలు అమ్ముకుని జీవనం సాగించే కొన్ని కుటుంబాలకు కట్టుబట్టలే మిగిలాయి. దుకాణ సామాగ్రితోపాటు, నగదు, ఇంట్లోని వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. కాగా, అగ్నిప్రమాద … Read more

కొమురవెల్లి దేవస్థానం చైర్మన్ నియామకంపై అన్యాయం.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, నవంబర్ 26, మనవార్త. కురుమ(బీసీ)కుల సంఘాల హక్కులపై ప్రశ్నలు లేచేవిధంగా, కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ నియామకమైన దిశగా ఉందని అసమర్థవంతమైన, ప్రశ్నార్థక విధానం”పై తెలంగాణ హైకోర్టు న్యాయవాది ప్రసన్న కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకటన ప్రకారం, ట్రస్టీ బోర్డు సభ్యులతో కానీ అందుబాటులో ఉన్న ఇతర వర్గాలకు (ప్రత్యేకంగా కురుమ సంఘాలకు) అవకాశాలు లేకపోవడంతో ఇది అన్యాయమైన నియామకం అని ఆయన అపహాస్యంగా అన్నారు. దేవునికి … Read more

ఆంజనేయస్వామి దేవాలయం అర్చకులు మృతి * మృతుని కుటుంబాన్ని పరామర్శించిన టి ఆర్ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్….

ఎల్కతుర్తి నవంబర్ 24 మన వార్త ప్రతినిధి ఎల్కతుర్తి మండలం వీరనారాయణపురం (దగ్గువారిపల్లి) గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి పూజారిగా భక్తి పూర్వకంగా సేవలందిస్తున్న సిద్ధాంతి సంతోష్ (43) అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 10:40 నిమిషాలకు మృతి చెందిన విషయం తెలిసిందే రెండు రోజులుగా అస్వాస్తతతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు మొదట గ్రామంలోని స్థానిక వైద్యులను సంప్రదించారు అయితే పరిస్థితి క్షీణించడంతో వెంటనే అనుమకొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ … Read more