రామాయం పేట జనవరి 12 ( మన వార్త ప్రతినిధి) రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామంలో అడవి జంతువు మాంసం అక్రమంగా విక్రయిస్తున్న వారిపై ఫారెస్ట్, పోలీస్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదివారం అడవి జంతువు మాంసం విక్రయిస్తున్నారన్న నమ్మదగిన సమాచారం అందడంతో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కుద్బుద్దిన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం గ్రామానికి చేరుకుని తనిఖీలు చేపట్టింది.ఈ తనిఖీల్లో భాగంగా ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో అడవి జంతువు మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మాంసం నిల్వ చేసి విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు అధికారులు గుర్తించారు. సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా, మరిన్ని వివరాలు వెలుగులోకి రావచ్చని తెలిపారు.అడవి జంతువుల వేట, మాంసం విక్రయం చట్టరీత్యా నేరమని అధికారులు హెచ్చరిస్తూ, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.