జనవరి 11 ( మన వార్త ప్రతినిధి )
మల్యాల మండలం తక్కళ్లపెల్లి గ్రామ సర్పంచ్ చీకట్ల లత -ఆంజనేయులు ను ఎన్నారై గడ్డం రమేష్ చంటి మర్యాద పూర్వకంగా ఆదివారం కలిసారు.అనంతరం గ్రామస్తుల సమక్షంలో సర్పంచ్ లత – ఆంజనేయులు లను శాలువతో సత్కరించారు. ఈ సందర్బంగా ఎన్నారై రమేష్ చంటి మాట్లాడుతూ, భవిష్యత్తు లో లత -ఆంజనేయులు మరెన్నో పదవులు పొందాలని ఆకాంక్షించారు.రాబోయే ఐదేళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామపంచాయతీలో ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రజలలో మంచి పేరును సంపాదించు కోవాలని చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమం లో సామజిక సేవకులు, నీలం శ్రీను, వంకాయల కార్తీక్ పాల్గొన్నారు.