రామయంపేట జనవరి 16 ( మన వార్త ప్రతినిధి) మెదక్ అసెంబ్లీ రామాయంపేట పట్టణంలోని బిజెపి కార్యాలయం లో రామాయంపేట పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధామల్లేష్ గౌడ్ హాజరయ్యారు . మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధామల్లేష్ గౌడ్ మాట్లాడుతూ రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోలేదని, రామయంపేట డివిజన్ ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని. రామయంపేటకు బస్ డిపో ఇస్తామని అది కూడా ఇవ్వలేదని. ఇంతకుముందు రామాయంపేట అసెంబ్లీ ఉండేది దాన్ని కూడా తీసివేయడం జరిగిందని ఆయన అన్నారు. అన్ని విధాలలో రామాయంపేట అభివృద్ధికి దూరంగా మిగిలిపోయిందని, వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో బిజెపి బలపరిచిన అభ్యర్థిని గెలిపించి రామాయంపేట మున్సిపాలిటీని బిజెపి పార్టీ కైవసం చేసుకోవాలని, ఓటర్లు సైతం ఆలోచించాలని అభివృద్ధి అనేది బిజెపితోనే సాధ్యమని ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుడిలా కష్టపడి పని చేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు . ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, రామాయంపేట మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, సీనియర్ నాయకులు సిద్ధిరాములు, అక్కన్నపేట్ సర్పంచ్ యాదగిరి, పట్టణ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రాజ్, దళిత మోర్చా నిమ్మల స్వామి, పట్టణ మహిళా మోర్చా లావణ్య, యువ మోర్చా కన్నయ్య కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.*