చిన్న శంకరంపేట జనవరి 16 ( మన వార్త ప్రతినిధి ) యువకులు గ్రామాల అభివృద్ధిలో ముందుండాలని భవిష్యత్తులో యువతకు అండగా ఉంటామని రాబోయే రోజుల్లో యువత అన్ని రంగాల్లో ముందుకు రావాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు చిన్న శంకరంపేట మండలం గవ్వల పల్లి గ్రామంలో పొన్నం కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గవలపల్లి ప్రీమియర్ క్రికెట్ లీగ్ మ్యాచ్ ను గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్నారు నేడు సంక్రాంతి పర్వదిన పురస్కరించుకొని స్థానిక హనుమాన్ దేవాలయం వద్ద మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనాంపల్లి రోహిత్ ముఖ్యఅతిథిగా హాజరై మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి గెలుపొందిన క్రీడాకారులకు మహిళలకు ఆయన చేతుల మీదుగా బహుమతులను అందజేశారు, క్రికెట్ పోటీలో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి 15 వేల రూపాయల నగదు తో పాటు ట్రోఫీ, రెండవ బహుమతి ఎనిమిది వేల నగదు తో పాటు ట్రోఫీని ఆయన అందజేశారు, వాలీబాల్ పోటీలలో గెలుపొందిన విజేతలకు సైతం బహుమతులను అందజేశారు అదేవిధంగా ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ బహుమతులను అందజేశారు,ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనoపల్లి రోహిత్ తో పాటు నాయకులు మాట్లాడుతూ యువకులు చెడు మార్గాన వెళ్ళకుండా గ్రామాల్లో ఇలాంటి పోటీలు నిర్వహించడం చాలా అభినందనీయమని క్రీడలలో గెలుపు ఓటములు సహజమని నేటి ఓటమి రేపటి విజయానికి సంకేతం అని వారన్నారు గ్రామాల అభివృద్ధిలో యువత ముందుండాలని భవిష్యత్తుల ఇంకెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని యువకులను ప్రోత్సహించే విధంగా అండగా ఉంటామని ఆయన అన్నారు అన్ని సమస్యలను పరిష్కరించేందుకు యువకులకు తోడుగా ఉంటామని గ్రామాల అభివృద్ధిలో యువత ముందుండాలని వారు పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సిద్ధిరాములు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మోహన్ నాయక్, అశోక్ నాయక్, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్ మాజీ జెడ్పిటిసి పోతరాజు రమణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ, సీనియర్ నాయకులు యాదవరావు,రాజిరెడ్డి, పోతరాజు మనోజ్ కుమార్, యాదగిరి, తోట లింగమూర్తి. ఆర్గనైజర్లు ప్రవీణ్, శ్రీకాంత్, నాగరాజు, గణేష్, అభిషేక్, నవీన్ రెడ్డి, సంగెమ్ అశోక్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు,