జయగిరి సబ్ స్టేషన్ లైన్ మెన్, ఆపరేటర్ సస్పెన్షన్….

హసన్ పర్తి జూన్ 28(మనవార్త ప్రతినిధి):హసన్ పర్తి మండలం జయగిరి సబ్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న లైన్ మెన్ కుమారస్వామి, ఆపరేటర్ యుగేందర్ లను సస్పెండ్ చేసినట్లు టీజీ ఎన్ పిడిసిఎల్ హన్మకొండ రూరల్ డిఇ సామ్యానాయక్ తెలిపారు. వారు విధులను నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు భధ్రతా చర్యలు తీసుకోకపోవడం మూలంగా ఎఎల్ఎం చంద్రమూర్తి ప్రమాదానికి గురయ్యారని పేర్కొన్నారు.ఈమేరకు వారిద్ధరినీ సస్పెండ్ చేసినట్లు ప్రకటనలో తెలిపారు.

నల్ల బెల్లం పటిక పట్టివేత సిఐ.మచ్చశివకుమార్…..

హనుమకొండ జూన్ 27(మనవార్త ప్రతినిధి):గుడుంబా తయారీకి ఉపయోగపడే నల్ల బెల్లం పటికను అక్రమంగా మహారాష్ట్ర నుండి తరలిస్తున్న వ్యక్తిని హనుమకొండ బస్టాండ్ ఆవరణ లో అదుపులోకి తీసుకొవడం జరిగింది.గూడూరు మండలం ఇప్పల తండాకు చెందిన ధరావత్ లచ్చిరామ్ అనే అతను అక్రమంగా గుడుంబా తయారు చేస్తూ తన ఊర్లో అమ్ముతున్నాడు అదే క్రమంలో శుక్రవారం ఉదయం మహారాష్ట్ర నుండి పదివేల రూపాయల విలువ గల నల్ల బెల్లం మరియు పట్టికను తరలిస్తుండగా హనుమకొండ పోలీస్ వారు పట్టుకొని … Read more

గ్రామపంచాయతీ కార్మికుల ముందస్తు అరెస్ట్….

తూప్రాన్ జూన్ 27 (మన వార్తా ప్రతినిధి, పి. ఆంజనేయులు గౌడ్) హైదరాబాద్ లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి ధర్నాకు వెళ్తున్న కార్మికులను తూప్రాన్ పోలీసులు శుక్రవారం ముందస్తు అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ పెండింగ్ బిల్లులను చెల్లించాలనే డిమాండ్ తో శాంతియుత ధర్నాకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం పట్ల పంచాయతీ కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని లేనిచో తమ కుటుంబాలు రోడ్డున … Read more

6 గురి పేకాట రాయుళ్ల అరెస్టు నగదు సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన – సిఐ రంగాకృష్ణ

జూన్ 27 (మన వార్త ప్రతినిధి, పి. ఆంజనేయులు గౌడ్) తూప్రాన్ పట్టణ పరిధి అల్లాపూర్ శివారులోని జైన్ వెంచర్లో పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారంతో సిఐ రంగాకృష్ణ ఆధ్వర్యంలో గురువారం అర్ధరాత్రి మెరుపు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి నుండి 10, 700 నగదు, ఐదు సెల్ ఫోన్లు, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రంగకృష్ణ తెలిపారు. ఈ దాడిలో తూప్రాన్ ఎస్ఐ 2 యాదగిరి, సర్కిల్ … Read more

ముగ్గురు మున్సిపల్ మేనేజర్లకు డిప్యూటేషన్….

తూప్రాన్ జూన్ 27 (మన వార్త ప్రతినిధి, పి. ఆంజనేయ గౌడ్) సిద్దిపేట, మెదక్ జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలో పని చేస్తున్న మున్సిపల్ మేనేజర్లకు డిప్యూటేషన్ కల్పిస్తూ మున్సిపల్ శాఖ డైరెక్టర్ టికే శ్రీదేవి ఆదేశాల జారీ చేశారు. తూప్రాన్ మున్సిపాలిటీలో పని చేస్తున్న మేనేజర్ రఘువరన్ ను రామాయంపేట మున్సిపాలిటీకి, సిద్దిపేట రెవెన్యూ ఆఫీసర్ శ్రీకాంత్ తూప్రాన్ మున్సిపాలిటీకి, రామాయంపేట మున్సిపల్ మేనేజర్ శ్రీనివాసులు సిద్దిపేట మున్సిపాలిటీకి డిప్యూటేషన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే … Read more

జాలిగామ లో నీటి కష్టాలు, బోరు బావుల వద్దకు పరుగులు…..

గజ్వేల్ జూన్ 27 (మన వార్త ప్రతినిధి జీ మురళి ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో శుక్రవారం గ్రామస్థులు బోరుబావుల వద్దకు వెళ్లి నీరు తీసుకువస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా గ్రామానికి మిషన్ భగీరథ నీరు సరఫరా ఆగిపోయి భగీరథ నీరు రావడంలేదని, త్రాగునీటికి ఇంటి అవసరాలకు నీటికి విపరీతమైన ఇబ్బంది నెలకొందని వ్యవసాయ పంట పొలాల వద్ద బోరు బావుల వద్దకు … Read more

తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు – 20 మంది ఏజెంట్లు అదుపులో..

సికింద్రాబాద్ జూన్ 26 మన వార్త ప్రతినిధి అంతోని :తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో అవినీతిని అరికట్టేందుకు బుధవారం ఉదయం ఏసీబీ (ఆంటీ-కరప్షన్ బ్యూరో) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం నుంచే పలు బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి దూసుకెళ్లి, ఏజెంట్ల కార్యకలాపాలను పసిగట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు.ఈ దాడుల్లో మొత్తం 20 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వారి వద్ద నుంచి నగదు, వాహన ధ్రువీకరణ పత్రాలు, మొబైల్ ఫోన్లు, ఇతర డాక్యుమెంట్లు … Read more

ఎవరికి నయా పైసా ఇవ్వలేదు– పదేండ్లు డబుల్ బెడ్ రూమ్ కోసం ఎదురుచూసినా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు కాలే*– ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ప్రెస్ మీట్…

శంకరపట్నం:జూన్ 26(మనవార్త ప్రతినిధి నేరెళ్ల సంతోష్) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో మా ఆశలు నెరవేరాయని 27 గ్రామాలకు చెందిన లబ్ధిదారులు విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. శంకరపట్నం మండలం కేశవపట్నం అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి 27 గ్రామాలకు చెందిన కొంతమంది లబ్ధిదారులు కేశవపట్నం చేరుకున్నారు.ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులు పదేళ్లుగా డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయాలని అప్పటి ఎమ్మెల్యే … Read more

చైతన్య నగర్ లో అక్రమ నిర్మాణం పై అధికారుల చర్యలు శూన్యం.

తెలంగాణ స్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జూన్ 26, మనవార్త. ఎల్బీనగర్ సర్కిల్ బి.ఎన్.రెడ్డి నగర్ పరిధిలోని చైతన్య నగర్ లో అక్రమ నిర్మాణాలు అధికారుల అండతో యాదేచ్చగా కొనసాగిస్తున్నారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ మామూళ్లకు కక్కుర్తి పడుతూ బాధ్యతలు మరిచిన అధికారులు సదరు అక్రమ నిర్మాణదారునికి సహకరిస్తుండగా యదేచ్చగా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులకు మించి అంతస్తులు అక్రమంగా నిర్మిస్తున్నాడు. బాధ్యత కలిగిన అధికారులు తమకేమీ పట్టనట్టుగా తమ జేబులు నింపుకుంటూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ … Read more

చెంగిచెర్లలో జులై 27న ప్రశాంతంగా బోనాల ఉత్సవాలు జరుపుకోవాలి.

తెలంగాణస్టేట్ బ్యూరో భాస్కర్ చారీ, జూన్ 25, మనవార్త. తెలంగాణలో అమ్మవారిని పూజించే ఉత్సవం బోనాల పండుగ మన సంస్కృతీ సంప్రదాయాలు కలబోసిన గ్రామదేవతల పండుగిది.రాష్ట్ర పండుగ బోనాల జాతరకు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని చెంగిచెర్ల ముస్తాబవుతోంది. జులై 27న ఆదివారం బోనాల వేడుకలు జరుపుకొనుటకు గ్రామ పెద్దలు, మాజీ కార్పొరేటర్ కొత్త చెందర్ గౌడ్, చెంగిచెర్ల గ్రామ పంచాయతీ మాజీ ఉపసర్పంచ్, బోడుప్పల్ కార్పొరేషన్ సీనియర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్త రవి గౌడ్,మాజీ … Read more