ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి నిర్మాణనికి భూమి పూజ పాల్గొన్న తూంకుంట నర్సారెడ్డి.అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తాం.ఆరు నెలల్లో గృహాల నిర్మాణం పూర్తి చేయాలి. – డిసిసి అధ్యక్షులు తూoకుంట నర్సారెడ్డి….

జూన్ 29,( మన వార్త ప్రతినిధి జీ మురళి)అర్హులైన ప్రతి పేదకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరి చేస్తున్నట్లు డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు ఆదివారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదిపుర్ గ్రామంలో లబ్ధిదారులతో కలిసి ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గజ్వేల్ నియోజక వర్గానికి 3 వేల ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటికే అర్హులైన 2938 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. అవసరమైన పక్షంలో మరిన్ని ఇండ్లు మంజూరీకి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రజాపాలనతో ప్రభుత్వ పథకాలను పేదల చెంతకు చేర్చుతుండగా, వారిలో ఆనందం చూస్తున్నట్లు చెప్పారు. అయితే గతంలో దివంగత ప్రధాని ఇందిరమ్మ పేదలకు ఇండ్లను అందించి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోగా, పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ముఖ్యంగా సొంత ఇంటి కల నెరవేరుస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి లబ్ధిదారులు రుణపడి ఉండాలని, ఆరు నెలల్లో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసి పండగ వాతావరణంలో గృహప్రవేశాలు చేసుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ ,ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, సుఖేందర్ పంచాయతీ సెక్రెటరీ కుమార్ స్వామి గజ్వేల్ రామచంద్రా రెడ్డి, మంద నర్సింలు,అందోల్ నరసింహులు,కోత్తపల్లి ఎల్లగౌడ్ ,బాలు గౌడ్, పాలా రాములు గౌడ్, బాల్ రాజు గౌడ్,అంజాగౌడ్, ప్రభాకర్, బిక్షపతి, రామచంద్రం, నరేందర్ రెడ్డి, స్వామి బొయని రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు

Leave a Comment