తూప్రాన్ మున్సిపల్ 13వ వార్డులో ఐమాక్స్ లైట్లు ప్రారంభించిన-గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి….

తూప్రాన్ జులై 3 (మన వార్తా ప్రతినిధి, పి. ఆంజనేయులు గౌడ్) తూప్రాన్ మున్సిపాలిటీలోని 13వ వార్డులో 3 లక్షల రూపాయల విలువచేసే ఐమాక్స్ లైట్లను అధికారులు ఏర్పాటు చేశారు. తూప్రాన్ పర్యటనలో భాగంగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి గురువారం కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. 13వ వార్డులో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయడానికి ప్రత్యేక చొరవ చూపిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి తాజా మాజీ మున్సిపల్ ఇంచార్జి చైర్మన్ నందాల శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ నాయకులకు పట్టం కట్టాలని నర్సారెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఏఈ మధుసూదన్ ,నాయకులు పల్లెర్ల రవీందర్ గుప్తా, మామిళ్ళ కృష్ణ, భగవాన్ రెడ్డి, రాజు,నారాయణ గుప్తా, విశ్వరాజ్, గడప దేవేందర్ ,జంగం రాములు, నాగరాజు గౌడ్, బొల్లు వెంకటేష్, అనిల్, ఉమర్, రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment