ఘనంగా కట్ట మైసమ్మ జాతర….

జూన్ 29 (మన వార్తా ప్రతినిధి, పి. ఆంజనేయులు గౌడ్) తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో కట్ట మైసమ్మ జాతర ఉత్సవాలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. వారం రోజుల క్రితం గ్రామంలోని గ్రామా దేవతలకు అత్యంత భక్తిశ్రద్ధలతో గ్రామస్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం కట్టమైసమ్మ వద్దకు ఘటంతో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. చెరువుల నుండి పుష్కలంగా పంటలు పండాలని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ మహాదేవి నవీన్, తాజా మాజీ ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, మాజీ సర్పంచ్ జిన్న స్వామి, గ్రామ పెద్దలు పిట్ల చంద్రయ్య, పాప నర్సింలు, జిన్న రమేష్, కాస సత్యం, మన్నె బాపురాజు, పిట్ల యాదగిరి, గండి గారి రాజు, జిన్న స్వామి, జిన్న కృష్ణ, శివరాములు, యాదగిరి, సత్తయ్య, రాజు పాల్గొన్నారు.

Leave a Comment