నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్య గారి శేఖర్ కు ఘన సన్మానం ….

గజ్వేల్ జూలై 10 (మన వార్త ప్రతినిధి జీ మురళి)సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ అధ్యక్షులు ఆర్యవైశ్య సంఘం గజ్వేల్ మండల అధ్యక్షుడు జగ్గయ్యగారి శేఖర్ నాచారం దేవస్థానం డైరెక్టర్ గా ఎన్నికైన సందర్భంగా బుదవారం గజ్వేల్ లో ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో చిరు సన్మానం చేసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి, నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఐవిఫ్ జిల్లా అధ్యక్షుడు నేతి శ్రీనివాస్, యువజన అధ్యక్షుడు ఎన్ సీ సంతోష్ మాట్లాడుతూ జగ్గయ్యగారి శేఖర్ రాజకీయ వ్యాపార రంగంలో రాణిస్తూ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని నాచారం దేవస్థానం డైరెక్టర్ గా ఎన్నికైన సందర్భంగా వారికి చిరు సన్మానం చేసి అభినందనలు తెలపడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Comment